For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత వృద్ధి రేటు అదుర్స్, అంచనాలకు మించి: ఫిచ్ అంచనా

|

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఫిచ్ రేటింగ్స్ సవరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను గతంలో 11 శాతం అంచనా వేసినప్పటికీ, రికవరీ వేగవంతమవుతుందని పేర్కొంటూ దీనిని 12.8 శాతానికి సవరించింది. బలమైన రికవరీ, మెరుగైన వైరస్ నియంత్రణ కారణంగా జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మరింత సానుకూలంగా అంచనా వేస్తున్నట్లు తన తాజా గ్లోబల్ ఎకనమిక్ ఔట్ లుక్(GEO)లో తెలిపింది. 2020 క్యాలెండర్ ఏడాది రెండో అర్ధ సంవత్సరంలో ఆర్థిక రికవరీ పుంజుుందని, క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకుందని తెలిపింది.

బ్యాంకులో పని ఉందా, వెంటనే పూర్తి చేసుకోండి.. లేదా! 27 నుండి వరుస సెలవులుబ్యాంకులో పని ఉందా, వెంటనే పూర్తి చేసుకోండి.. లేదా! 27 నుండి వరుస సెలవులు

12 శాతానికి సవరణ

12 శాతానికి సవరణ

ఈ నేపథ్యంలో FY22 జీడీపీ వృద్ధి అంచనాలను 11 శాతం నుండి 12 శాతానికి సవరిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అయినప్పటికీ కరోనా ముందుస్థాయి అంచనాల కంటే తక్కువే ఉందని పేర్కొంది. గత ఏడాది మొదటి రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా మైనస్ 23.9 శాతం, మైనస్ 7.3 శాతం కాగా, డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.4 శాతం సానుకూలంగా ఉందని తెలిపింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో రెండో అర్ధ సంవత్సరంలో లాక్ డౌన్, మాంద్యం నుండి భారత్ కోలుకుందని తెలిపింది. రికవరీ చాలా వేగంగా ఉందని పేర్కొంది.

తాజా కేసుల ప్రభావం

తాజా కేసుల ప్రభావం

2020 చివరలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోవడం, కేసులు క్షీణించడంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ పుంజుకుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. హై-ఫ్రీక్వెన్సీ సూచీలు 2021 క్యాలెండర్ ఏడాదికి బలంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఫిబ్రవరి నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ కాస్త సానుకూలంగా ఉందని, మొబిలిటీ, సర్వీస్ పీఎంఐ బలమైన వృద్ధిని కనబరుస్తున్నాయని తెలిపింది. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం 2021 వృద్ధి పైన కాస్త ప్రభావం ఉండవచ్చునని తెలిపింది.

ఆటో రంగంపై ప్రభావం

ఆటో రంగంపై ప్రభావం

ఆటో చిప్ కొరత 2021 మొదటి అర్ధ సంవత్సరంలో ఈ రంగం వృద్ధిని, పారిశ్రామిక ఉత్పత్తి లాభాలను తాత్కాలికంగా తగ్గిస్తుందని ఫిచ్ పేర్కొంది. FY22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మంచి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని, ఖర్చు గణనీయంగా పెంచేవిధంగా సాగుతోందని తెలిపింది. బలహీనమైన ఆర్థిక రంగం పెట్టుబడులు వ్యయాన్ని పరిమితం చేస్తూ క్రెడిట్ సదుపాయాన్ని కఠినంగా ఉంచే అవకాశముందని తెలిపింది.

English summary

భారత వృద్ధి రేటు అదుర్స్, అంచనాలకు మించి: ఫిచ్ అంచనా | Fitch Revises India GDP Growth to 12.8 per cent for FY22 from 11 per cent

Fitch Ratings has revised India's GDP growth estimate to 12.8 per cent for the fiscal year beginning April 1 from its previous estimate of 11 per cent, saying its recovery from the depths of the lockdown-induced recession has been swifter than expected.
Story first published: Thursday, March 25, 2021, 14:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X