కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల వృద్ధి రేటు భారీగా పడిపోతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును ఫిచ్ రేటింగ్స్ 0.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కరోనా వైరస్, సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం కనిపిస్తోందని పేర్కోంది. భారత్ పైన కూడా తీవ్ర ప్రభావం కనిపిస్తోందని పిచ్ రేటింగ్స్ తన గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో తెలిపింది.

2021-22లో భారీ వృద్ధి
2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు 0.8 శాతానికి పడిపోతుందని తెలిపింది. అంతకుముందు ఇదే ఫిచ్ రేటింగ్స్ 4.9 శాతం అంచనా వేసింది. అదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు భారీగా పుంజుకొని 6.7 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

వరుస క్వార్టర్‌లలో మైనస్
వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో మైనస్‌లలో ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో మైనస్ 0.2 శాతం, జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌లో మైనస్ 0.1 శాతం ఉంటుందని తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో వృద్ధి 1.4 శాతంగా ఉంటుందని, జనవరి-మార్చి క్వార్టర్‌లో 4.4 శాతం వృద్ధి రేటు ఉంటుందని పేర్కొంది.

వినియోగ వ్యయం భారీగా తగ్గడం వల్లే
భారత వృద్ధి రేటు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణంగా కన్స్యూమర్ స్పెండింగ్ తగ్గిపోవడమే కారణమని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 0.3 శాతంగా మాత్రమే ఉంటుందని పేర్కొంది. గత ఏడాది ఇది 5.5 శాతంగా ఉంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ..
2020 క్యాలెండర్ ఇయర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.9 శాతం తగ్గుతుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. 2009 సంక్షోభం కంటే రెండింతలు తీవ్రమని తెలిపింది. వైరస్ కారణంగా 2020లో ప్రపంచ జీడీపీలో 4.5 ట్రిలియన్ డాలర్ల నష్టమని తెలిపింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications