For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీకి మరో ఫైనాన్స్ రిలీఫ్: ఆర్థిక లోటు భర్తీ గ్రాంట్ విడుదల

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కిందటి నెల ఈ బకాయిలను రాష్ట్రాలకు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 21 రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేసింది. దీని మొత్తం 86,912 కోట్ల రూపాయలు.

జీఎస్టీ బకాయిల చెల్లింపుల్లో ఏపీ వాటా 3,199 కోట్ల రూపాయలు. తెలంగాణ వాటా కింద 296 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి మరో ఫైనాన్స్ రిలీఫ్‌ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రెవెన్యూ లోటు భర్తీ మొత్తాన్ని విడుదల చేసింది. దీని విలువ 880 కోట్ల రూపాయలు. ఏపీతో పాటు మొత్తం 14 రాష్ట్రాలకు సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీ మొత్తం 7,183 కోట్ల రూపాయలు.

Finance ministry released the revenue deficit grant of Rs 7183 crore to 14 states including AP

ఇందులో ఏపీ వాటా 880 కోట్ల రూపాయలను రెవెన్యూ లోటు భర్తీని ఎదుర్కొంటోన్న రాష్ట్రాల్లో ఏపీ సహా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాలకు పోస్ట్ రివేల్యుయేషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను విడుదల చేయాలంటూ 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ నిధులను మంజూరు చేసింది.

ఈ మొత్తం పోస్ట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ (పీడీఆర్డీ) కిందికి వస్తుందని ఆర్థికశాఖ అధికారులు వివరించారు. ఈ నెలకు సంబంధించిన మొత్తంగా దీన్ని భావించాల్సి ఉంటుందని తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు 21,550.25 కోట్ల రూపాయలుగా లెక్కకట్టింది. ప్రస్తుతం ఏపీ ఇప్పుడు ఎదుర్కొంటోన్న ఆర్థికలోటు నేపథ్యంలో- కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా 880 కోట్ల రూపాయల లోటు మొత్త విడుదల కావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకున్నట్టయింది.

English summary

ఏపీకి మరో ఫైనాన్స్ రిలీఫ్: ఆర్థిక లోటు భర్తీ గ్రాంట్ విడుదల | Finance ministry released the revenue deficit grant of Rs 7183 crore to 14 states including AP

The finance ministry on Monday released the third monthly instalment of revenue deficit grant of Rs 7,183 crore to 14 states.
Story first published: Tuesday, June 7, 2022, 13:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X