కరోనా కాలంలో మార్కెట్లకు డిమాండ్ సృష్టించేందుకు వచ్చే ఆరు నెలల కాలంలో రూ.1 లక్ష కోట్లను సమకూర్చనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్యోగులకు సెలవులతో కూడిన ప్రయాణ రాయితీ (LTC) కింద నగదు ఓచర్లు, పండుగ అడ్వాన్స్‌తో ఇవ్వడంతో పాటు 50 ఏళ్ల దీర్ఘకాలానికి రాష్ట్రాలకు రుణ మంజూరు, కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం పెంపు ద్వారా ఈ మొత్తాన్ని మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. రూ.73వేల కోట్ల ప్రభుత్వపరమైన మద్దతును లేదా ప్యాకేజీని ప్రకటించింది. 6 నెలల్లో ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం వల్ల వ్యాపారాలు పుంజుకొని అదనపు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

రూ.73వేల కోట్ల ప్యాకేజీలో దేనికెంత
LTC క్యాష్ వోచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ.73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఇందులో ఎల్టీసీ, శాలరీ అడ్వాన్స్ కోసం వరుసగా రూ.28,000, రూ.8,000 కోట్లు, ప్రయివేటు ఉద్యోగుల ఎల్టీసీ నగదు వోచర్లు రూ.28,000 కోట్లు, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణం రూ.12వేల కోట్లు ఉన్నాయి. రూ.25,000 కోట్లను రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో మౌలిక వసతుల కోసం కేంద్రం అదనంగా ఖర్చు చేయనుంది.

ఏపీ, తెలంగాణకు ఎంత రుణం వస్తుందంటే
రాష్ట్రాలకు ప్రకటించిన రూ.12 వేల కోట్ల రుణంలో రూ.1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ.900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు, రూ.7,500 కోట్లు ఇతర రాష్ట్రాలకు కేటాయించారు. 50 ఏళ్ల దీర్ఘకాలానికి రూ.12వేల కోట్ల వడ్డీరహిత మూలధన రుణాలను ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ వ్యవధిలో వడ్డీ, అసలు చెల్లించాల్సిన అవసరం లేదు. రుణాన్ని మూడు భాగాలుగా విభజించిన ప్రకారం హిమాలయ రాష్ట్రాలకు రూ.2500 కోట్లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.308.32 కోట్లు, తెలంగాణకు రూ.159.975 కోట్లు వచ్చాయి.

ఆ షరతులను పూర్తి చేస్తే..
ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద కేంద్రం విధించిన నాలుగు షరతుల్లో మూడింటిని పూర్తి చేసిన రాష్ట్రాలకు మిగిలిన రూ.2వేల కోట్లను అందిస్తారు. ఇందులో ఏపీకి రూ.82.22 కోట్లు, తెలంగాణకు రూ.42.66 కోట్లు వస్తాయి. రూ.12వేల కోట్లను రాష్ట్రాలు మార్చి 31వ తేదీలోపు ఖర్చు చేయాలి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications