For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెడరల్ బ్యాంకు నుండి మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డు

|

మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డును లాంచ్ చేయడానికి ఫెడరల్ బ్యాంకు వన్-కార్డ్‌తో జత కట్టింది. చాలాకాలంగా క్రెడిట్ కార్డ్ డిమాండ్ పెరుగుతోంది. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే క్రెడిట్ కార్డు ఎంతో ప్రయోజనం. ఇష్టారీతిన వాడితో అంతేస్థాయిలో తలనొప్పి. కాబట్టి క్రెడిట్ కార్డును చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. బ్యాంకులు కూడా పలు క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తూ వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫెడరల్ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డను తీసుకువచ్చింది. అదే మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డ్. ఫిన్‌టెక్ సంస్థ‌ వన్‌కార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. రాబోయే పండుగ సీజ‌న్ కస్టమర్లకు మరింత ద‌గ్గ‌రయ్యేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఫెడరల్ బ్యాంకు తెలిపింది.

కరోనా మహమ్మారి నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో పండుగ సీజన్‌లో డిమాండ్ పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఫెడరల్ బ్యాంకు ఈ క్రెడిట్ కార్డును వన్-కార్డ్ యాప్ ద్వారా కేవలం మూడు నిమిషాల్లోనే జారీ చేస్తుంది. అయితే ఫిజికల్ కార్డు మీకు డెలివరీ అయ్యే వరకు కూడా వర్చువల్ కార్డు యాక్టివేట్ కావడంతో పాటు దానిని ఉపయోగించవచ్చు. యాప్ ద్వారా కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులను నియంత్రించవచ్చు.

Federal Bank partners OneCard for mobile first credit card

ఖ‌ర్చును ట్రాక్ చేయ‌డం దగ్గరి నుండి రివార్డ్ పాయింట్స్, కార్డ్ ట్రాన్సాక్షన్స్ ప‌రిమితిని సెట్ చేయ‌టం వ‌ర‌కు అన్ని యాప్ ద్వారా చేయవచ్చు. 23 సంవత్సరాల నుండి 35 సంవ‌త్స‌రాల వయస్సు కలిగిన యంగ్ వ‌ర్కింగ్ ప్రొఫెష‌న‌ల్స్ టార్గెట్‌గా ఈ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు బ్యాంకు తెలిపింది.

డెలాయిట్ నివేదిక ప్రకారం మిల్లీనియల్స్, జెన్ జెడ్ వరుసగా 35 శాతం, 27 శాతం ఉన్నారు. డిజిటల్ ఎట్ ది ఫోర్ అండ్ హ్యూమన్ ఎట్ ది కోర్ మంత్రంతో ప్రతి వాటాదారుని చేరుకోవాలని, అత్యంత ప్రశంసనీయ బ్యాంకుగా మారాలని ఫెడరల్ బ్యాంకు భావిస్తోంది.

English summary

ఫెడరల్ బ్యాంకు నుండి మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డు | Federal Bank partners OneCard for mobile first credit card

Federal Bank on Wednesday announced that it has partnered with fintech company OneCard to launch a mobile-based credit card.
Story first published: Thursday, September 23, 2021, 20:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X