For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Auto Sales: ఫిబ్రవరిలో తగ్గిన మారుతీ సుజుకీ సేల్స్

|

ఏడాదిన్నరగా ఆటోమొబైల్ సేల్స్ ఆశాజనకంగా లేవు. దసరా, దీపావళి పర్వదినాల సమయంలో, ఆ తర్వాత నెలలో కాస్త పుంజుకున్నట్లుగా కనిపించిన ఆటో సేల్స్ మళ్లీ పడిపోయాయి. దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ విక్రయాలు ఫిబ్రవరి నెలలో తగ్గాయి. 2019 ఇదే నెలలో 1,39,100 విక్రయించగా, ఈసారి 1,34,150కి పరిమితమైంది. ఎగుమతులు మాత్రం 7.1 శాతం పెరిగాయి. గత ఏడాది 9,582 కార్లు విక్రయించగా, ఈసారి 10,261 ఎగుమతి అయ్యాయి. 2699 గ్లాన్జా కార్లను ఎగుమతి చేసింది. మొత్తంగా విక్రయాలు స్వల్పంగా తగ్గాయి.

కరోనా దెబ్బకు 5 బిలియన్ డాలర్ల ముఖేష్ అంబానీ సంపద ఆవిరికరోనా దెబ్బకు 5 బిలియన్ డాలర్ల ముఖేష్ అంబానీ సంపద ఆవిరి

ఈ సేల్స్ పుంజుకున్నాయి

ఈ సేల్స్ పుంజుకున్నాయి

గత ఏడాది మారుతీ సుజీకు కార్ల విక్రయాలు మొత్తంగా 1,48,682 ఉండగా, ఈసారి 1,47,110గా ఉంది. మొత్తంగా కార్ల విక్రయాలు 1 శాతం మేర పడిపోయాయి. మారుతీ చిన్న కార్ల సెగ్మెంట్ బాగా కోలుకుంది. ముఖ్యంగా ఆల్టో, ఎస్ ప్రెస్పో విక్రయాలు 11.1 శాతం పెరిగాయి. యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్‌లో విటారా బ్రెజ్జా, ఎక్సఎల్ 6, ఎస్ క్రాస్‌లు బీఎస్ 6 పెట్రోల్ వాహనాలు మార్కెట్లోకి రావడంతో వీటి విక్రయాలు 3.5 శాతం మేర పుంజుకున్నాయి.

కాంప్టాక్ విభాగంలో తగ్గుదల

కాంప్టాక్ విభాగంలో తగ్గుదల

మారుతీ సుజుకీకి ప్రధానంగా ఆదాయం తీసుకు వచ్చే కాంపాక్ట్ విభాగంలోని వేగనార్, స్విఫ్ట్, డిజైర్, సెలిరియో, బాలినో, ఇగ్నిస్ కార్ల విక్రయాలు 3.9 శాతం మేర తగ్గాయి. మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 17.5 శాతం పడిపోయాయి. ముఖ్యంగా మారుతీ ఈకో వ్యాన్ విక్రయాలు 22.9 శాతం తగ్గాయి. సూపర్ క్యారీ వాణిజ్య వాహన విక్రయాల్లో 79.5 శాతం తగ్గాయి.

సేల్స్ ఇలా...

సేల్స్ ఇలా...

మారుతీ సుజుకీ సేల్స్ మొత్తంగా 1.1 శాతం (147,110) తగ్గాయి. కార్ల ఎగుమతులు 7.1 శాతం (10,261) పెరిగాయి. డొమెస్టిక్ సేల్స్ 3.6 శాతం (134,150) తగ్గాయి. డొమెస్టిక్ పాసింజర్ సేల్స్ 2.3 శాతం (133,702) తగ్గాయి. మిడ్ సైజ్ కారు సేల్స్ 17.5 శాతం (2,544) తగ్గాయి. మినీ ప్యాసింజర్ వెహికిల్ సేల్ 11.1 శాతం (27,499) పెరిగాయి. కాంపాక్ట్ వెహికిల్ సేల్ 3.9 శాతం (69,828) తగ్గాయి.

English summary

Auto Sales: ఫిబ్రవరిలో తగ్గిన మారుతీ సుజుకీ సేల్స్ | February Auto Sales: Maruti Suzuki’s Sales Falls 1 percent

Hyundai Motor India Ltd. on Sunday reported a 10.3 percent decline in total sales at 48,910 units in February.
Story first published: Sunday, March 1, 2020, 19:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X