For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mark Zuckerberg: 100 ఏళ్ల నాటి ఇంటిని అమ్మేసిన మార్క్ మామ; వామ్మో.. రేటు వింటే గుటకలు మింగాల్సిందే..

|

Mark Zuckerberg: ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సంస్థ బాస్ మార్క్ జుకర్‌బర్గ్ తన వందేళ్ల నాటి ఇంటిని అమ్మేశాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన విలాసవంతమైన ఇంటిని ఈ ఏడాది విక్రయించాడు. 2012లో కొనుగోలు చేసిన ఈ ఇంటిని 10 ఏళ్ల తరువాత అమ్మేశాడు.

రికార్డు ధరకు అమ్మకం..

రికార్డు ధరకు అమ్మకం..

దాదాపు 7,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిని 31 మిలియన్ డాలర్లుకు విక్రయించాడు. అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు రూ. 250 కోట్లని చెప్పుకోవాలి. ఈ విధంగా.., ఈ సంవత్సరం శాన్ ఫ్రాన్సిస్కోలో అత్యంత ఖరీదైన ఇంటిని విక్రయించిన రికార్డును కూడా జుకర్‌బర్గ్ సృష్టించాడు.

ధనవంతులు నివసించే ప్రాంతంలో..

ధనవంతులు నివసించే ప్రాంతంలో..

మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఇంటిని నవంబర్ 2012లో కేవలం 10 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 80 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం ఈ ఇంటిని మూడు రెట్లు అధిక ధరకు ఆయన విక్రయించి రికార్డు సృష్టించారు.

ఇంటిని ఎప్పుడు కట్టారు..

ఇంటిని ఎప్పుడు కట్టారు..

ఇంటి అమ్మకానికి సంబంధించిన ప్రకటన ప్రకారం.. 1928 సంవత్సరంలో ఈ ఇంటిని నిర్మించారు. అంటే.. ఈ ఇల్లు దాదాపు 100 సంవత్సరాల నాటిది. ఈ ఇల్లు మిషన్ డిస్ట్రిక్ట్, జుకర్‌బర్గ్ శాన్ ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్ సమీపంలో ఉంది. ఈ ఇల్లు డోలోరెస్ పార్క్ పరిసరాల్లోని లిబర్టీ హిల్‌లోని నిశ్శబ్దమైన ప్రశాంత వాతావరణంలో ఉంటుంది.

జుకర్‌బర్గ్ కు అనేక ఖరీదైన ఇళ్లు..

జుకర్‌బర్గ్ కు అనేక ఖరీదైన ఇళ్లు..

ఫేస్‌బుక్ IPO తర్వాత.. జుకర్‌బర్గ్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిసిల్లా చాన్ ఈ ఇంటిని పునరుద్ధరించడానికి 2013లో మిలియన్ల డాలర్లు వెచ్చించారు. ఇద్దరూ లాండ్రీ రూమ్, వైన్ రూమ్, వెట్ బార్, గ్రీన్‌హౌస్ వంటి మార్పులు చేశారు. జుకర్‌బర్గ్‌కు సిలికాన్ వ్యాలీ, లేక్ తాహో, హవాయిలో అనేక ఇతర విలాసవంతమైన గృహాలను కలిగి ఉన్నాడు. జుకర్‌బర్గ్ తన ఖరీదైన గృహాల విషయంలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు.

ఈ ఏడాది తగ్గిన జుకర్‌బర్గ్ సంపద..

ఈ ఏడాది తగ్గిన జుకర్‌బర్గ్ సంపద..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ మొత్తం నికర విలువ ప్రస్తుతం 61.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఐటీ షేర్లలో భారీ పతనం కారణంగా ఫేస్‌బుక్, దాని మాతృ సంస్థ మెటాపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. దీని కారణంగా.. జుకర్‌బర్గ్ సంపద 2022లో దాదాపు 50 శాతం వరకు తగ్గింది. జూలై 26, 2022 నాటి వరకు ఉన్న డేటా ప్రకారం.. జుకర్‌బర్గ్ 63.5 బిలియన్ డాలర్లు లేదా అతని సంపదలో సగానికి పైగా కోల్పోయారు. ఒకప్పుడు ప్రపంచంలోని టాప్- 10 సంపన్నుల్లో ఒకరిగా నిలిచిన మార్క్ జుకర్‌బర్గ్.. సంపద ఆవిరి కావటంతో 17వ స్థానానికి పడిపోయాడు.

English summary

Mark Zuckerberg: 100 ఏళ్ల నాటి ఇంటిని అమ్మేసిన మార్క్ మామ; వామ్మో.. రేటు వింటే గుటకలు మింగాల్సిందే.. | facebook co-founder Mark Zuckerberg sold his 100 years old house in san fransisco for a hefty amount know details

facebook co-founder Mark Zuckerberg sold his 100 years old house
Story first published: Tuesday, July 26, 2022, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X