For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free Shares: 50 వేలకు పైగా రైతులకు ఉచితంగా షేర్లు.. ఆరు రాష్ట్రాల్లోని వారికి ఉపయోగం..

|

FabIndia Shares: మీకు ఎత్నిక్ వేర్ అంటే ఇష్టమైతే ఫ్యాబిండియా బ్రాండ్ పేరు వినే ఉంటారు. FabIndia దేశంలోనే మొట్టమొదటి సంస్థ.. ఇది సంస్థతో సంబంధం ఉన్న రైతులు, చేతివృత్తుల వారికి కంపెనీ వాటాలను ఉచితంగా అందజేస్తోంది. వాస్తవానికి ఫ్యాబిండియా ప్రమోటర్లు కళాకారులకు తమ వాటాను అందించాలని నిర్ణయించారు. అయితే.. హస్తకళాకారులు వాటా పొందేందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి.

 హస్తకళాకారులకు గుడ్ న్యూస్..

హస్తకళాకారులకు గుడ్ న్యూస్..

ఫ్యాబ్‌ఇండియా ప్రమోటర్లు.. బిమ్లా నందా బిసెల్, మధుకర్ ఖేరా తమ వాటాలను రైతులకు, చేతివృత్తిదారులకు బహుమతులుగా అందజేయనున్నారు. బిమ్లా నందా 4,00,000 షేర్లను, ఖేరా 3,75,080 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఫ్యాబ్‌ఇండియాతో నిర్దిష్ఠ కాలం పాటు అనుబంధం కలిగి ఉండి, వారితో వ్యాపారం చేస్తున్న వారి కోసం ఈ షేర్లను అందిస్తారు. చాలా మంది చేతివృత్తులవారు, రైతులు రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందినవారు ఉన్నారు.

50 వేలకు పైగా సరఫరాదారులు..

50 వేలకు పైగా సరఫరాదారులు..

ఫ్యాబ్ ఇండియా కాంట్రాక్ట్ తయారీ ద్వారా రైతులు, చేతివృత్తుల వారితో అనుసంధానించబడి ఉంది. ప్రస్తుతం కళాకారుల సంఖ్య 50 వేలకు పైగానే ఉంది. భారతదేశ సాంప్రదాయ కళ, పనితనాన్ని సజీవంగా ఉంచడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే వారు తయారు చేసే వస్తువులకు మెరుగైన విలువను కంపెనీ అందిస్తోంది. ఫ్యాబ్‌ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ సింగ్ మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనం, లాభాల మధ్య సరైన సమతుల్యతను సాధించాలని తాను విశ్వసిస్తున్నానన్నారు. సంస్థ ఈ చర్య హస్తకళాకారుల విశ్వాసాన్ని బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు.

95-98 శాతం సహజ వస్తువులు..

95-98 శాతం సహజ వస్తువులు..

FabIndia తమ వస్తువులు చాలా వరకు పర్యావరణ అనుకూల పద్ధతిలో తయారు చేయబడతాయని పేర్కొంది. వారి దుస్తుల్లో 95 నుంచి 98 శాతం సహజ పదార్థాలను ఉపయోగిస్తారని తెలిపారు. బట్టల గురించి మాట్లాడుతూ.. అందులోని వస్త్రం సహజ దారాలతో తయారు చేయబడిందని అన్నారు. చెక్కతో చేసిన మగ్గాలపై తయారీ ఉంటుందని వెల్లడించారు. దీనితో పాటు జనపనార, చెరకు, ఎమ్‌డిఎఫ్, ప్లై బోర్డ్ మొదలైన వాటిని కూడా తయారీలో ఉపయోగిస్తారని తెలుస్తోంది.

English summary

Free Shares: 50 వేలకు పైగా రైతులకు ఉచితంగా షేర్లు.. ఆరు రాష్ట్రాల్లోని వారికి ఉపయోగం.. | Fabindia promotors Distributing Shares For Free To More Than 50 Thousand Farmers And Artisans across Six States who associated with company

Fabindia promotors Distributing Shares For Free To famers and Artisans
Story first published: Monday, July 4, 2022, 17:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X