For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ సోషల్ మీడియా యాప్ వాడొద్దు .. నో ప్రైవసీ .. ఉద్యోగులకు నిపుణుల వార్నింగ్

|

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవ సంస్థ వాట్సప్ సంస్థ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారుల డేటా, భద్రత , గోప్యత లపై గత కొద్ది రోజులుగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా సంస్థల్లో నిపుణులు వాట్సప్ వాడకంపై తమ సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారు . తాజాగా టాటా స్టీల్ తో పాటుగా ఇండియన్, మల్టీనేషనల్ కంపెనీలు వాట్సప్ వినియోగంపై తమ సిబ్బందితో కీలక అంశాలపై హెచ్చరికలు జారీ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ ఖాతా సస్పెన్షన్ ఎఫెక్ట్ .. జర్మనీలో 8% క్షీణించిన ట్విట్టర్ షేర్ ధరడొనాల్డ్ ట్రంప్ ఖాతా సస్పెన్షన్ ఎఫెక్ట్ .. జర్మనీలో 8% క్షీణించిన ట్విట్టర్ షేర్ ధర

 కంపెనీల రహస్య కీలక విషయాలను వాట్సప్ యాప్ లో పంపొద్దు

కంపెనీల రహస్య కీలక విషయాలను వాట్సప్ యాప్ లో పంపొద్దు

కంపెనీకి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్ ని వాట్సప్ లో పంపవద్దని సూచించారు. క్రిటికల్ జాబ్ కాల్స్ కు కూడా వాట్సప్ ని వినియోగించకూడదు అని హెచ్చరించారు. వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సప్ డేటాను ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఉద్యోగులను ఆయా కంపెనీలు అలెర్ట్ చేస్తున్నాయి .

అనేక భారతీయ మరియు బహుళజాతి కంపెనీలు సిబ్బందికి సలహాలు ఇవ్వడం ప్రారంభించాయి.

సైబర్ సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు హెచ్చరిక

సైబర్ సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు హెచ్చరిక

వాట్సాప్‌లో సున్నితమైన కంపెనీ సమాచారాన్ని పంచుకోకుండా ఉండమని మరియు క్లిష్టమైన వ్యాపార కాల్స్ కోసం వాట్సప్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం మానేయమని కోరాయి. బిజినెస్ మీటింగ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా పంపొద్దని చెప్తున్నారు. సైబర్ సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు. కొత్త గా మార్చిన ప్రైవసీ పాలసీ ఫీచర్స్ తో వాట్సాప్ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లతో వీలైనంతవరకూ డేటా షేర్ చేసుకుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే

వాట్సాప్ తో జాగ్రత్త అంటూ ఎంప్లాయిస్ కి వార్నింగ్ ఇస్తున్నారు

ప్రైవసీ పాలసీ మార్పుపై కంపెనీల్లో భయం

ప్రైవసీ పాలసీ మార్పుపై కంపెనీల్లో భయం

వాట్సప్ కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ రూల్స్ ప్రకారం 2021 ఫిబ్రవరి ఎనిమిదో తేదీ లోపు ఆ రూల్స్ ను అంగీకరించకపోతే వాట్సాప్ ను వినియోగించుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ ఆ ప్రైవసీ పాలసీ అంగీకరిస్తే యూజర్లు వాడే ఫోన్ మోడల్ దగ్గర్నుండి ప్రతి ఒక్కటి వాట్సాప్ కి తెలుస్తుంది. మన ఫోన్లో మనం వినియోగించే బ్రౌజింగ్ డేటాతో సహా మొత్తం వాట్సాప్ సంస్థ చేతికి చేరుతుంది. దీంతో వినియోగదారుల్లో వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలైన వాట్సాప్, ఫేస్ బుక్ లను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.

English summary

ఆ సోషల్ మీడియా యాప్ వాడొద్దు .. నో ప్రైవసీ .. ఉద్యోగులకు నిపుణుల వార్నింగ్ | Experts warning to employees over social media app whatsapp privacy policy

Several Indian and multinational companies have started issuing advisories to staff, asking them to avoid sharing sensitive company information on WhatsApp and stop using the platform for critical business calls.
Story first published: Tuesday, January 12, 2021, 19:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X