కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ అకౌంట్ నుండి నగదును ఉపసంహరించుకుంటున్నారు. ఏప్రిల్ - జూలై మధ్య ఇప్పటి వరకు 8 మిలియన్ల మంది రూ.30,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. 60 మిలియన్ల ఉద్యోగులు, వారి యజమానుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ.10 లక్షల కోట్ల కార్పస్‌ను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తోంది. ఈపీఎఫ్ఓలోకి ఎప్పుడు ఎక్కువగా నిధులు వస్తాయి. కానీ కరోనా కారణంగా ఈసారి పెద్ద మొత్తంలో ఉపసంహరణలు చోటు చేసుకున్నాయి. ఇది ఫండ్ ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు అంటున్నారు.

కరోనా విండో కింద పెద్ద ఎత్తున ఉపసంహరణ
ఏప్రిల్ నుండి జూలై మూడో వారం వరకు సాధారణంగా ప్రతి ఏడాది జరిగే ఉపసంహరణల కంటే ఎక్కువగా జరిగినట్లు ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాల కోత, వేతన కోత, మెడికల్ ఖర్చులకు ఇవి నిదర్శనమని అంటున్నారు. మొత్తం ఉపసంహరణలలో 3 మిలియన్లు (30 లక్షలు) లబ్ధిదారులు కరోనా విండో కింద రూ.8,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. మిగిలిన రూ.22,000 కోట్లను 50 లక్షల ఈపీఎఫ్ఓ చందాదారులు సాధారణ ఉపసంహరణ కింద తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా మెడికల్ అడ్వాన్స్‌లు ఉన్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కేసులు పెరిగితే ఉపసంహరణలు పెరగవచ్చు
కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి చివరి వారంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడంతో పాటు కోవిడ్ కింద ఈపీఎఫ్ ఉపసంహరణకు అవకాశం కల్పించింది. కరోనా కేసులు పెరుగుతున్నా కొద్దీ ఈపీఎఫ్ఈ ఉపసంహరణలు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో 10 మిలియన్ల మంది తమ సేవింగ్స్ నుండి ఉపసంహరించుకునేలా ఉందని చెబుతున్నారు.

4 నెలల్లోనే..
ఈపీఎఫ్ఓ FY2020లో 15 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు రూ.72,000 కోట్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.30,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 15 మిలియన్ల మందికి చెల్లిస్తే ఈసారి నాలుగు నెలల్లోనే 8 మిలియన్లు దాటింది. కరోనా నేపథ్యంలో ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లు మొత్తంలో 75 శాతం లేదా మూడు నెలల వేతనం.. ఇందులో ఏది తక్కువ అయితే దానిని తీసుకునే వెసులుబాటు కల్పించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications