For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPFO Rules: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి పెన్షన్.. పూర్తి వివరాలు..

|

EPFO Rules: ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నవారికి శుభవార్త. మీరు ఉద్యోగం చేస్తూ 10 ఏళ్లు పూర్తి చేసినట్లయితే ఈ వార్తను తప్పనిసరిగా చదవి తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ ఇచ్చే యోచనలో ఉంది.

పెన్షన్ సౌకర్యం..

పెన్షన్ సౌకర్యం..

సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 10 ఏళ్లు పనిచేస్తే ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం పెన్షన్ సౌకర్యం ఉందని మనందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితిలో 58 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది. పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా కొంత సొమ్ము మినహాయించడమే ఇందుకు కారణం. ఈ స్కీమ్ ప్రయోజనాన్ని పొందడానికి ఉద్యోగులు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది.

EPFO రూల్స్..

EPFO రూల్స్..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేయబడుతుంది. అలాగే ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్‌కి వెళ్తుంది. కంపెనీ వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో డిపాజిట్ చేయబడింది. మిగిలిన 3.67 శాతం EPFకి వెళుతుంది.

10 ఏళ్లు నిబంధన..

10 ఏళ్లు నిబంధన..

ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పెన్షన్ సౌకర్యాన్ని పొందటానికి ఒక ఉద్యోగి 10 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసి ఉండాలి. అయితే ఎవరైనా ఉద్యోగి 10 ఏళ్ల కంటే తక్కువ అంటే 9 సంవత్సరాల 6 నెలలు పనిచేసినా దానిని 10 సంవత్సరాల సర్వీసుగా గుర్తించటం జరుగుతుంది. అదే తొమ్మిదిన్నర సంవత్సరాల కంటే తక్కువ కాలం పనిచేస్తే అది ఒక్క రోజు అయినప్పటికీ 9 సంవత్సరాల సర్వీసుగా గుర్తిస్తారు. అలాగే ఉద్యోగి పదవీ విరమణకు ముందే పెన్షన్ మెుత్తాన్ని విత్ డ్రా చేసుకున్నట్లయితే.. వారికి పెన్షన్ రాదు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

1. పనిచేస్తున్న సంస్థ నుంచి వెళ్లిపోయి.. తర్వాత ఉద్యోగం చేయటానికి ముందు గ్యాప్ ఉన్నట్లయితే మీ UAN నంబర్‌ను మార్చవద్దు.

2. ఉద్యోగి వివిధ కంపెనీలకు మారుతున్నప్పుడు, కొత్త కంపెనీ తరఫున ఖాతాకు డబ్బు జమ చేయబడుతుంది. ఇది మీ గతంలోని ఉద్యోగ కాలానికి యాడ్ అవుతుంది. అందువల్ల మళ్లీ మెుదటి నుంచి 10 ఏళ్లు పనిచేయాల్సిన అవసరం ఉండదు.

3. ఉదాహరణకు రెండు కంపెనీల్లో 5 ఏళ్లు కాడికి పనిచేస్తే మెుత్తం 10 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి సదరు ఉద్యోగిని పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. రెండు ఉద్యోగాల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ పనిచేసిన కాలం పూర్తిగా 10 ఏళ్లు ఉంటే సరిపోతుంది.

Read more about: epfo pension pf business news
English summary

EPFO Rules: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి పెన్షన్.. పూర్తి వివరాలు.. | EPFO Giving Pension To Private Employees Who completes 10 Years Job Tenure

EPFO Giving Pension To Private Employees Who completes 10 Years Job Tenure
Story first published: Sunday, October 30, 2022, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X