ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకారం ఫిబ్రవరి నెలలో కొత్త ఎన్‌రోల్‌మెంట్స్ తగ్గాయి. అంతకుముందు నెలలో 10.71 లక్షలు నమోదు కాగా, ఫిబ్రవరి 2020లో 10.34 లక్షలకు (3.4 శాతం) పడిపోయింది. అదే సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే నికరంగా 76.53 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.
అంతక్రితం ఆర్థిక ఏడాది ఇదే కాలంలో ఈ నమోదు రేటు 61.12 లక్షలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్ నుంచి ఎప్పటికి అప్పుడు విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 2017 నుండి ఫిబ్రవరి 2020 మధ్య నికర సబ్‌స్క్రైబర్స్ 1.53 కోట్లుగా ఉన్నట్లు డేటా చూపించింది.

సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 మధ్య 15.52 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఉద్యోగుల రికార్డ్స్ అప్ డేట్ నిరంతర ప్రక్రియ కాబట్టి పేరోల్ డేటా ప్రస్తుతానికి తాత్కాలికమేనని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయనే భయాలు నెలకొన్న విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications