For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Crisis: ఉత్పత్తినే తగ్గించారు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ కొరత ఉంటుందా?

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండియాలో ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఇది మరికొద్ది రోజులు పొడిగించే అవకాశాలు లేకపోలేదు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయు. కేంద్రం ఉచిత బియ్యం లేదా గోదుమలు, పప్పు ఇస్తోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా నిలిచిపోయింది. దీంతో రానున్న కాలంలో దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడుతుందా?

కరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదు

సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది

సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది

లాక్ డౌన్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరిపడా ఉందని, దేశంలో ఎలాంటి ఫ్యూయల్ సంక్షోభం లేదని, అవసరం మేరకు నిల్వలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు ఇండియా. దేశంలోని అన్ని ప్లాంట్స్, సరఫరా లోకేషన్స్ పూర్తిగా పనిచేస్తున్నాయని తెలిపారు.

అవసరాల మేరకు నిల్వలు..

అవసరాల మేరకు నిల్వలు..

మూడు వారాల లాక్ డౌన్ ఉన్నప్పటికీ అంతకుమించి అవసరాల మేరకు నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతి మూలకు అవసరమైన మేర ఇంధనం చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఇంధనానికి ఎలాంటి షార్టేజ్ లేదని, కాబట్టి కస్టమర్లు భయంతో ఎల్పీజీని రీఫిల్ చేసి దాచుకోవద్దన్నారు.

ఏప్రిల్ నెలకు సరిపడా ఇంధనం

ఏప్రిల్ నెలకు సరిపడా ఇంధనం

ఏప్రిల్ నెల మొత్తానికి కూడా ఇంధనం సరఫరా అయ్యేలా రంగం సిద్ధం చేశామని చెప్పారు. డిమాండ్ మేర అవసరాలు తీర్చేందుకు అన్ని స్థాయిల్లో రిఫైనరీలు పని చేస్తున్నాయన్నారు. అన్ని బల్క్ స్టోరేజీలతో పాటు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్స్, పెట్రోల్ పంపులు పని చేస్తాయన్నారు. ఫ్యూయల్ షార్టేజ్ మాత్రం లేదని స్పష్టం చేశారు.

తగ్గిన ఇంధన డిమాండ్

తగ్గిన ఇంధన డిమాండ్

నేషనల్ వైడ్ లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు అన్ని వ్యాపారాలు క్లోజ్ అయ్యాయని, విమానాలు, రైళ్లు, ప్రజా రవాణా.. వాహనాలన్నీ నిలిచిపోయాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)తో సహా ఇంధన డిమాండుపై ప్రతికూల ప్రభావం ఉందన్నారు. చాలా కార్లు, వాహనాలు రోడ్డు పైకి రావడం మానేశాయి. దీంతో మార్చిలో పెట్రోల్ డిమాండ్ 8 శాతం మేర పడిపోయింది. డీజిల్ 16 శాతం, ఏటీఎఫ్ 20 శాతం పడిపోయింది.

200 శాతం పెరిగిన రీఫిల్ డిమాండ్

200 శాతం పెరిగిన రీఫిల్ డిమాండ్

పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వినియోగం తగ్గినప్పటికీ ఎల్పీజీ వినియోగం పెరిగిందని చెప్పారు. కస్టమర్లందరికీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో రీఫిల్ డిమాండ్ 200 శాతం పెరిగిందన్నారు. కస్టమర్ల నుండి గ్యాస్ రీఫిల్ డిమాండ్ ఆందోళన కలిగిస్తోందని, డబుల్ సిలిండర్ ఉన్నవారు కనీసం తమ ఒక సిలిండర్ కూడా పూర్తి కాకముందే బుక్ చేస్తున్నారన్నారు.

ఆందోళన చెందవద్దు

ఆందోళన చెందవద్దు

ఆందోళనతో బుకింగ్స్ అవసరం లేదని, డిమాండ్‌కు సరిపడా స్టాక్స్ ఉన్నాయని చెప్పారు. కస్టమర్లు ఆందోళనతో బుకింగ్ చేస్తే ఇది వ్యవస్థపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఆందోళనతో సిలిండర్ బుక్ చేసినప్పటికీ, ఇళ్లలోని సిలిండర్ అయిపోకపోవడంతో డెలివరీ బాయ్స్ సిలిండర్లు వెనక్కి తీసుకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయన్నారు.

ఇంధనాల ఉత్పత్తి తగ్గుదల

ఇంధనాల ఉత్పత్తి తగ్గుదల

ఇంధన డిమాండ్ తక్కువగా ఉన్నందున రన్ రేట్ 25-30 శాతం మేర తగ్గినట్లు సింగ్ చెప్పారు. అంటే పెట్రోల్, డీజిల్, ఏటీఎప్ తదితర అన్ని ఇంధనాల ఉత్పత్తి 30 శాతం తగ్గుతుంది. ముడిచమురు ప్రతి బ్యారెల్ ఉత్పత్తి చేసినప్పుడు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్, ఎల్పీజీ.. నిర్దిష్ట శాతం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి క్రూడాయిల్ ప్రాసెసింగ్ తగ్గింపుతో అన్ని ఇంధనాల ఉత్పత్తి తగ్గుతుంది.

English summary

enough stock of petrol, diesel, LPG available to last lockdown

India, the world's third largest energy consumer, has enough petrol, diesel and cooking gas (LPG) in stocks to last way beyond the three-week nationwide lockdown as all plants and supply locations are fully operational, Indian Oil Corp (IOC) Chairman Sanjiv Singh said.
Story first published: Sunday, March 29, 2020, 13:49 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more