For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Elon Musk: ట్విట్టర్ ఉద్యోగుల అన్ హ్యాపీ: ఎల్లుండే కీలక భేటీ: కొర్రీలపై

|

వాషింగ్టన్: టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ఎటూ తేలట్లేదు. ట్విట్టర్ కొనుగోలు ప్రతిపాదనలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించిన తరువాత.. అది ముందుకు సాగట్లేదు. మూడు నెలల్లో ట్విట్టర్ యాజమాన్య బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

 ఫేక్ అకౌంట్స్‌పై..

ఫేక్ అకౌంట్స్‌పై..

ట్విట్టర్ ఫేక్, స్పామ్ అకౌంట్స్ వ్యవహారంపై ఎలాన్ మస్క్ లేవనెత్తిన అనుమానాలతో తాత్కాలికంగా ఈ బిగ్ డీల్‌కు బ్రేక్ పడింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ చేతికి వెళ్లినట్టే వెళ్లిన ఈ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ కొనుగోలు ప్రక్రియలో అనుకోని అవాంతరాలు వచ్చి పడ్డాయి. కొనుగోలు ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.

బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్న దశలో..

బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్న దశలో..

అపర కుబేరుడు లాన్ మస్క్- 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఆ కంపెనీ కూడా అంగీకరించింది. మస్క్ చేసిన ప్యాకేజీకి ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. మూడు నెలల్లో కంపెనీ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దశలో దీనికి బ్రేక్ పడింది.

 ఉద్యోగుల్లో వ్యతిరేకత..

ఉద్యోగుల్లో వ్యతిరేకత..

యాజమాన్య బదిలీ ట్విట్టర్ ఉద్యోగులకు నచ్చట్లేదు. మెజారిటీ ఎంప్లాయిస్ దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. ఎలాన్ మస్క్ చేతికి వెళ్లిన తరువాత కంపెనీ భవితవ్యం ఎలా ఉంటుందనే విషయంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. కొన్ని సందర్భాల్లో ట్విట్టర్‌పై ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలను గుప్పించడాన్ని తప్పుపడుతున్నారు.

మస్క్ భేటీ..

మస్క్ భేటీ..

ఈ పరిస్థితుల మధ్య ఎలాన్ మస్క్.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉద్యోగులందరితో ఆయన సమావేశం కానున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగ్రవాల్ సహా టాప్ క్యాడర్ మేనేజ్‌మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సహా ఎంప్లాయిస్ అందరితోనూ చర్చించనున్నారు. వారి అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

 ఎల్లుండే సమావేశం..

ఎల్లుండే సమావేశం..

వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ భేటీ ఉంటుందని ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది. ట్విట్టర్ ఉద్యోగులతో ఎలాన్ మస్క్.. భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్విట్టర్ ఉద్యోగులు అడిగే ప్రశ్నలకు మస్క్.. సమాధానాలిస్తారని, అలాగే- స్పామ్ అకౌంట్స్‌పై మస్క్‌కు ఉన్న సందేహాలను ఉద్యోగులు తీరుస్తారని అంటున్నారు.

English summary

Elon Musk: ట్విట్టర్ ఉద్యోగుల అన్ హ్యాపీ: ఎల్లుండే కీలక భేటీ: కొర్రీలపై | Elon Musk will address Twitter employees at a company-wide meeting on June 16

Elon Musk will address Twitter employees at a company-wide meeting on June 16. The virtual meeting is set for Thursday morning and Musk will take questions from Twitter employees.
Story first published: Tuesday, June 14, 2022, 10:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X