Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా నిషేధం ఎత్తివేత
యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేసింది. ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎలోన్ మస్క్ ట్రంప్ పై నిషేధం ఎత్తివేయాలా వద్దా అనే దానిపై పోల్ నిర్వహించారు. ఎక్కువ శాతం మంది ట్రంప్ పై నిషేధం ఎత్తి వేయాలని కోరినట్లు మస్క్ తెలిపారు.దీంతో డొనాల్డ్ ట్రంప్ నిషేధం ఎత్తివేసినట్లు మస్క్ ప్రకటించారు. దాదాపు 51.8 శాతం మంది యూజర్లు అమెరికా మాజీ అధ్యక్షుడు మళ్లీ ట్విట్టర్‌లోకి రావాలని కోరుకున్నారు.
ఫేస్ బుక్
ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల ముందు ట్విట్టర్ నిషేధం ఎత్తివేసింది. కాపిటల్ హిల్ అల్లర్ల తరువాత 2021లో "హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున" ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ నిషేధం విధించింది. అతని Facebook పేజీకి కూడా ఇదే విధమైన చర్య తీసుకుంది. పోల్ ముగియడానికి కొద్దిసేపటి ముందు ట్రంప్ మాట్లాడారు. తన సొంత ప్లాట్‌ఫారమ్‌కు కట్టుబడి ఉంటానని చెప్పాడు.
The people have spoken.
— Elon Musk (@elonmusk) November 20, 2022
Trump will be reinstated.
Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv

రిపబ్లికన్
"ట్విటర్‌లోకి తిరిగి వెళ్లడానికి మాకు పెద్ద ఓటు లభిస్తుందని నేను విన్నాను. దానికి కారణం నాకు కనిపించడం లేదు కాబట్టి నేను చూడలేదు'' అని లాస్ వెగాస్‌లో జరిగిన రిపబ్లికన్ యూదు కూటమి సమావేశంలో ట్రంప్ వీడియో లింక్ ద్వారా చెప్పారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. గత నెలలో మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత, దాదాపు సగం మంది సిబ్బందిని తొలగించారు. శుక్రవారం నాడు, కొత్త బాస్ "సుదీర్ఘ పని గంటలు" గురించి అల్టిమేటం తర్వాత చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేశారు.