For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tesla: ఎలాన్ మస్క్ ప్రకటనతో బేజారిన బిట్ కాయిన్.. క్రిప్టో పెట్టుబడులను అమ్మేసిన టెస్లా..

|

Elon Musk: ఎలాన్ మస్క్ తన పెట్టుబడుల ద్వారా క్రిప్టో మార్కెట్లను చాలా ప్రభావితం చేశారు. తాను కొన్న క్రిప్టో కరెన్సీల విషయాలను ట్విట్టర్ ద్వారా తెలిపేవారు. తాజా వివరాల ప్రకారం.. జూన్ 30 నాటికి తమ బిట్‌కాయిన్‌ పెట్టుబడుల్లో దాదాపు 75 శాతం ఇప్పటికే విక్రయించినట్లు ఎలక్ట్రిక్-కార్ తయారీ దిగ్గజం టెస్లా బుధవారం వెల్లడించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 936 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని నగదుగా మార్చినట్లు తెలిపింది.

బిలియన్ డాలర్ల పెట్టుబడులు..

బిలియన్ డాలర్ల పెట్టుబడులు..

టెస్లా ఫిబ్రవరి 2021లో క్రిప్టోకరెన్సీలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించినప్పుడు టెస్లా సెన్సేషన్ సృష్టించింది. అప్పట్లో బిట్‌కాయిన్ ధర ఆకాశాన్ని తాకింది. 2021 చివరి నాటికి బిట్‌కాయిన్ కొత్త గరిష్ఠాలకు ఎగబాకడంతో టెస్లా తన వాటాను చాలా వరకు కలిగి ఉంది.

మాంద్యం కారణంగా..

మాంద్యం కారణంగా..

కానీ.. విస్తృత ఆర్థిక మాంద్యం మధ్య గత కొన్ని నెలలుగా బిట్‌కాయిన్ విలువ పడిపోయింది. ఈ సంవత్సరం దాని విలువలో 50% కంటే ఎక్కువ క్షీణించింది. టెస్లా ప్రకటన తర్వాత బుధవారం మధ్యాహ్నం బిట్ కాయిన్ ధర మళ్లీ పడిపోయింది.

తగ్గిన కార్ల అమ్మకాలు..

తగ్గిన కార్ల అమ్మకాలు..

బుధవారం ఒక కాన్ఫరెన్స్ కాల్‌లో టెస్లా CEO ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. చైనాలో COVID-19 ఆంక్షల కారణంగా.. ఏర్పడిన అనిశ్చితితో కార్ల అమ్మకాలు తగ్గాయి. షాంఘైలో కరోనావైరస్ లాక్డౌన్ వల్ల టెస్లా తన ఫ్యాక్టరీలో వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేసింది. ఈ కారణంగా త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు తగ్గాయని ఆయన తెలిపారు.

క్రిప్టోలపై ఇలా..

క్రిప్టోలపై ఇలా..

"చైనాలో కొవిడ్ లాక్‌డౌన్‌లు ఎప్పుడు తగ్గుతాయో మాకు తెలియటం లేదు, కాబట్టి క్యాష్ లిక్విడిటీని పెంచుకోవడం మాకు చాలా ముఖ్యం" అని మస్క్ అన్నారు. భవిష్యత్తులో మా బిట్‌కాయిన్ హోల్డింగ్‌లను పెంచడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. టెస్లా ఇప్పటికీ డాగ్‌కోయిన్‌ని కలిగి ఉంది. టెస్లా తన ఆన్‌లైన్ స్టోర్‌లో చెల్లింపులకు డాగ్‌కోయిన్‌ని అంగీకరిస్తుందని ఎలాన్ మస్క్ తెలిపారు. జూన్ 30 నాటికి "డిజిటల్ ఆస్తులు"లో ఇప్పటికీ 218 మిలియన్ డాలర్లు ఉన్నాయి.

English summary

Tesla: ఎలాన్ మస్క్ ప్రకటనతో బేజారిన బిట్ కాయిన్.. క్రిప్టో పెట్టుబడులను అమ్మేసిన టెస్లా.. | elon musk owned tesla sold majority of its stake in crypto currency bitcoin for liquidity

Tesla seems to be abandoning its ten-figure bitcoin bet amid a severe slump in cryptocurrency markets
Story first published: Thursday, July 21, 2022, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X