For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతలోనే 35 నుండి రెండో కుబేరుడిగా.. నిన్న జుకర్‌బర్గ్, నేడు బిల్‌గేట్స్‌ను దాటేసిన ఎలాన్ మస్క్

|

వాషింగ్టన్: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌ను అధిగమించి, ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. ఎలాన్ సంపద 7.2 బిలియన్ డాలర్లు పెరిగి 127.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ (127.7 బిలియన్ డాలర్లు)ను దాటేశారు. ఇటీవలే ఎలాన్ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను దాటి, మూడో స్థానానికి వచ్చారు. కొద్ది రోజుల్లోనే రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 35వ స్థానంలో ఉన్న అతను ఏకంగా రెండో స్థానానికి చేరారు. మస్క్ సంపద ఏడాదిలో 100.3 బిలియన్ డాలర్లు ఎగిసింది.

2 గంటల్లో రూ.1.1 లక్షల కోట్లు.. జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టిన ఎలాన్ మస్క్2 గంటల్లో రూ.1.1 లక్షల కోట్లు.. జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టిన ఎలాన్ మస్క్

టెస్లా ఎఫెక్ట్.. 1 నెలల్లో 35 నుండి 2వ స్థానానికి

టెస్లా ఎఫెక్ట్.. 1 నెలల్లో 35 నుండి 2వ స్థానానికి

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం 49 ఏళ్ల ఎలాన్ మస్క్ అందరు బిలియనీర్ల కంటే ఈ ఏడాది ఎక్కువగా ఆర్జించారు. జనవరిలో బ్లూమ్‌బర్గ్ ప్రకటించిన ప్రపంచ 500 మిలియనీర్లలో అతను 35వ స్థానంలో ఉన్నాడు. కొద్ది నెలల క్రితం టాప్ 10లోకి వచ్చాడు. నవంబర్ నెలలో టాప్ 3కి, ఇప్పుడు 2వ స్థానంలోకి వచ్చాడు. టెస్లా రాణించడంతో అతని సంపద అమాంతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్ డాలర్లను తాకింది. అతని ఆర్జనలో మూడో వంతు టెస్లా షేర్లు ఉన్నాయి. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్/స్పేసెక్స్ షేర్ల కంటే టెస్లా నాలుగు రెట్లు ఎక్కువ. ఒక సంవత్సరంలో ఇంతమేర సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు.

బిల్ గేట్స్‌కు ఇది రెండోసారి

బిల్ గేట్స్‌కు ఇది రెండోసారి

ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాని కంటే దిగువన ఉండటం బిల్ గేట్స్‌కు గత ఎనిమిదేళ్లలో ఇది రెండోసారి మాత్రమే. 2017లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. గేట్స్‌ను దాటి మొదటి స్థానంలోకి వచ్చారు. గేట్స్ సంపదలో ఎక్కువమొత్తం దాతృత్వ కార్యకలాపాలకు వినియోగిస్తారు. చారిటీకి వినియోగించకుంటే ప్రస్తుతం ఉన్న అతని సంపద 127.7 బిలియన్ డాలర్ల కంటే ఎంతో ఎక్కువ ఉండేది. 2006 నుండి గేట్స్ ఫౌండేషన్‌కు అతను 27 బిలియన్ డాలర్లు అందించారు. ఈ ఏడాది ప్రారంభం నుండి బ్లూమ్‌బర్గ్ ప్రపంచ 500 కుబేరుల సంపద 23 శాతం లేదా 1.3 ట్రిలియన్ డాలర్లు పెరిగింది.

మార్క్ జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టి

మార్క్ జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టి

ఎలాన్ మస్క్ ఇటీవలే ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ మూడో ధనవంతుడిగా ఎదిగారు. 120 నిమిషాల్లోనే అతని సంపాదన 15 బిలియన్ డాలర్లు లేదా 1.1 లక్షల కోట్లు సంపాదించారు. దీంతో అతను ప్రపంచ మూడో కుబేరుడిగా నిలిచారు అప్పుడు. అమెరికా సూచీ ఎస్ అండ్ పీ 500లో టెస్లా చోటు దక్కించుకోవడంతో ఈ ఘనత దక్కింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 180 బిలియన్ డాలర్లకు పైగా సంపాదనతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ అండ్ పీలో టెస్లా కంపెనీ చోటు దక్కించుకుంది. డిసెంబర్ 21వ తేదీ నుండి ఈ షేరుకు చోటు కల్పిస్తున్నట్లు గత సోమవారం ఎస్ అండ్ పీ డౌజోన్స్ ఇండెక్స్ పేర్కొంది.

English summary

అంతలోనే 35 నుండి రెండో కుబేరుడిగా.. నిన్న జుకర్‌బర్గ్, నేడు బిల్‌గేట్స్‌ను దాటేసిన ఎలాన్ మస్క్ | Elon Musk overtakes Bill Gates to grab world's second richest ranking

Elon Musk’s year of dizzying ascents hit a new apex Monday as the Tesla Inc. co-founder passed Bill Gates to become the world’s second-richest person.
Story first published: Tuesday, November 24, 2020, 13:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X