డోనాల్డ్ ట్రంప్ వివాదం: ఎలోన్ మస్క్‌కు భారీ నష్టం, కుప్పకూలిన టెస్లా షేర్లు !
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన వివాదం కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. అయితే ప్రభుత్వ బడ్జెట్ బిల్లు విషయంలో ట్రంప్, ఎలోన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీని ప్రభావం టెస్లా షేర్లపై స్పష్టంగా కనిపించింది. నిన్న టెస్లా షేర్లు 14% పైగా పడిపోయాయి, కేవలం మూడు గంటల్లోనే కంపెనీ $152 బిలియన్ల భారీ నష్టాన్ని చవిచూసింది. టెస్లా చరిత్రలో ఇది అత్యంత మర్చిపోని రోజుగా నమోదైంది.

పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు పతనం: టెస్లా షేర్ల పతనం కారణంగా ఎలోన్ మస్క్ నికర విలువ కూడా గణనీయంగా తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ఆయన మొత్తం సంపద విలువ ఏకంగా $33.9 బిలియన్లు తగ్గింది. ఈ మొత్తం పాకిస్తాన్ మొత్తం రక్షణ బడ్జెట్ ($11 బిలియన్లు - 2024లో) కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ క్షీణతతో మస్క్ నికర విలువ ప్రస్తుతం $335 బిలియన్లకు చేరింది. ఈ ఏడాది ఆయన నికర విలువ మొత్తంగా చూస్తే $97.9 బిలియన్లు పడిపోయింది, అంటే గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ ($82.5 బిలియన్లు) కంటే కూడా ఎక్కువ.
ట్రంప్ బెదిరింపులు: డోనాల్డ్ ట్రంప్, ఎలోన్ మస్క్ మధ్య వివాదంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో మస్క్ కంపెనీలు ట్రంప్ పరిపాలనతో మంచి సంబంధాలు ఉండటం వల్ల ప్రయోజనం పొందుతాయని పెట్టుబడిదారులు ఆశించారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ బిల్లును మస్క్ అసహ్యకరమైనదిగా అభివర్ణించడంతో ఈ వివాదం మొదలైంది.
దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో, బడ్జెట్‌లో డబ్బు ఆదా చేయడానికి సులభమైన మార్గం ఎలోన్ ప్రభుత్వ సబ్సిడీలు ఇంకా కాంట్రాక్టులను ముగించడం. బిడెన్ ఇలా ఎందుకు చేయలేదని నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాను!" అని రాశారు. ట్రంప్ చేసిన ఈ బెదిరింపు టెస్లా షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కంపెనీ వాల్యుయేషన్ $1 ట్రిలియన్ కంటే దిగువకు పడిపోయి గురువారం $916 బిలియన్లకు చేరింది.
టెస్లాతో పాటు ఎలోన్ మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్ కూడా ప్రమాదంలో ఉంది. స్పేస్‌ఎక్స్ ఫెడరల్ ప్రభుత్వం నుండి బిలియన్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులను పొందింది, ఇందులో నాసా చాల ముఖ్యమైన మిషన్లు కూడా ఉన్నాయి. స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఈ వివాదం కంపెనీల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.