For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ రెండో కుబేరుడి స్థానం నుండి పడిపోయిన ఎలాన్ మస్క్

|

ఓ సమయంలో ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా నిలిచిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. చాలా కాలంగా ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. టెస్లా షేర్స్ భారీగా ఎగిసినప్పుడు ఓ సమయంలో ఆయన కొద్ది సమయం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను దాటి మొదటి స్థానంలోకి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎంతోకాలంగా నెంబర్ టూ స్థానంలో ఉంటున్నారు. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు.

ఎలాన్ మస్క్ స్థానంలోకి ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువులు తయారు చేసే ఎల్‌వీఎంహెచ్ సంస్థ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ వచ్చారు. మొదటి స్థానంలో జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం జనవరి నెలలో ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలోకి వచ్చారు ఎలాన్ మస్క్. జనవరి నుండి ఇప్పటి వరకు మస్క్ సంపాదనలో 24 శాతం క్షీణించింది. దీంతో మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

Elon Musk Loses 2nd Richest Ranking To Louis Vuittons Bernard Arnault

ఎలాన్ మస్క్ ట్వీట్లు కూడా ఆయన సంపాదనపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బిట్ కాయిన్‌పై మస్క్ చేసిన ట్వీట్స్ ద్వారా బిట్ కాయిన్ వ్యాల్యూ కొంత తగ్గింది. కరోనా మహమ్మారి సమయంలో టెస్లా స్టాక్స్ జంప్ కావడంతో పాటు బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం కూడా కలిసి వచ్చింది.

English summary

ప్రపంచ రెండో కుబేరుడి స్థానం నుండి పడిపోయిన ఎలాన్ మస్క్ | Elon Musk Loses 2nd Richest Ranking To Louis Vuitton's Bernard Arnault

Elon Musk's Twitter posts keep sending Bitcoin prices tumbling. His own fortune is heading in the same direction.
Story first published: Tuesday, May 18, 2021, 18:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X