For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Elon Musk: ఒకేసారి రెండు అస్త్రాలు.. ఏంటో మస్క్ మామ భయపెట్టేస్తున్నాడు.. ఇరుక్కుంటున్నాడు..

|

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. నిన్న ఉద్యోగులను పీకేయాలనుకుంటున్నట్లు చెప్పిన మస్క్ ఈ రోజు దానికి ఒక కారణాన్ని చెబుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సారి ఆయన కామెంట్ చేసింది ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి కావటం ఇప్పుడు అందరినీ కలవరానికి గురిచేస్తోంది. అవును ఆసలు ఇంతకీ ఆయన వాదన ఏమిటి..? అందుకు ఆయన చెబుతున్న కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆర్థిక మాంద్యం..

మాంద్యం భయాలు అందరిలో మాదిరిగానే ఈ దిగ్గజ వ్యాపారవేత్తలోనూ ఉన్నాయి. ఈ తరుణంలో అది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని ట్విట్టర్ వేధికగా తెలిపాడు. మాంద్యం పరిస్థితులు మార్చి 2024 వరకు కొనసాగుతాయంటూ తన మదిలోని మాటను పంచుకున్నాడు. అది కూడా ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇలా టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ రియాక్ట్ అయ్యారు.

అమ్మకాలపై భయాలు..

అమ్మకాలపై భయాలు..

శుక్రవారం మాట్లాడుతూ చైనా, యూరప్‌లో డిమాండ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు మస్క్. మాంద్యంపై తన అంచనాలను సైతం పంచుకున్నారు. బలహీనపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచుకోవడం ఎలక్ట్రిక్-వాహన తయారీదారు టెస్లాకు కొంచెం కష్టమేనని ఎలాన్ మస్క్ అన్నారు. మస్క్ మామ చేసిన ఈ కామెంట్లతో టెస్లా కంపెనీ షేర్లు గురువారం నష్టపోయాయి.

ఉద్యోగుల కోత..

ఉద్యోగుల కోత..

ఇక ట్విట్టర్ డీల్ విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చారు. ట్విట్టర్ ఇంక్‌ని కొనుగోలు చేయడానికి తన ఒప్పందంలో కాబోయే పెట్టుబడిదారులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా కంపెనీకి చెందిన 75% మంది ఉద్యోగులను పీకేయాలనుకుంటున్నట్లు ప్లాన్ చేస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. కంపెనీ పేరోల్ ను సుమారు 800 మిలియన్ డాలర్లకు తగ్గించాలని చూస్తున్నట్లు సమాచారం. యాజమాన్యం మార్పుతో రానున్న నెలల్లో అనేక మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.

మస్క్ పై యూఎస్ కన్ను..

మస్క్ పై యూఎస్ కన్ను..

ట్విట్టర్ ఇంక్, స్పేస్‌ఎక్స్ కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ల ఒప్పందంతో సహా ఎలాన్ మస్క్ చేపట్టిన కొన్ని వెంచర్‌లను జాతీయ భద్రతా సమీక్షలకు యూఎస్ లోబడి చేయాలా వద్దా అని బైడెన్ పరిపాలన అధికారులు చర్చిస్తున్నారు. తనకు ఇప్పటికే 80 మిలియన్ డాలర్లు ఖర్చు అయిందంటూ.. ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీస్‌ నిలిపివేస్తానని బెదిరించాడు.

పైగా అతను రష్యాకు అనుకూలమైన ట్వీట్స్ చేస్తున్నట్లు US అధికారులు అంటున్నారు. దీంతో యూఎస్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలోని అధికారులు మస్క్ వెంచర్‌లను సమీక్షించడానికి ఫెడరల్ ప్రభుత్వాన్ని అనుమతించే మార్గాలపై దృష్టి పెట్టారు.

Read more about: elon musk twitter tesla recession
English summary

elon musk expects recession exists till 2024, ready to fire 75 percent twitter staff

elon musk expects recession exists till 2024, ready to fire 75 percent twitter staff
Story first published: Saturday, October 22, 2022, 9:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X