For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా: దేశవ్యాప్తంగా 5 నెలల కనిష్టానికి పడిపోయిన విద్యుత్ వినియోగం

|

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇండియా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో దేశీయంగా విద్యుత్ వాడకం కూడా భారీగా తగ్గిపోయిందట. ఇది ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఇండియా లాక్ డౌన్ 25వ తేదీన ప్రారంభమైంది. ఆ రోజున వినియోగం దాదాపు ఐదు నెలల కనిష్టానికి చేరుకుంది. నెలవారీ విద్యుత్ వినియోగం ఈ నెలలో, వచ్చే నెలలో భారీగా పడిపోయే అవకాశముంది.

మార్చి 25వ తేదీన నేషనల్ విద్యుత్ వినియోగం 2.78 బిలియన్ యూనిట్లకు పడిపోయింది. మార్చి తొలి మూడు వారాల్లో ప్రతి రోజు 3.45 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగంతో పోలిస్తే ఇది 20 శాతం తగ్గుదల. అయితే కొన్ని రాష్ట్రాల్లో పూర్తి షట్ డౌన్ లేనిచోట విద్యుత్ వినియోగం పెరిగింది.

electricity demand falls to 5 month low after lockdown

ఉత్తర ప్రదేశ్‌లో లాక్ డౌన్ తొలి రోజు మార్చి 25 విద్యుత్ వినియోగం మార్చి మొదటి మూడు వారాల్లోని ప్రతిరోజుతో పోలిస్తే 3.4 శాతం మేర తగ్గింది. అదే సమయంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో 40 శాతం మేర తగ్గింది. ఈస్ట్ లక్నో ప్రాంతంలో పవర్ లూమ్స్ రాత్రంతా నడిచినట్లు చెబుతున్నారు.

ఆ రోజు దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మాత్రం పెరిగింది. హోస్ హోల్డ్ ఎయిర్ కండిషనర్స్, ఇతర హోమ్ అప్లియెన్సెస్ వినియోగం కారణం కూడా తోడయిందని చెబుతున్నారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోను స్వల్పంగా వినియోగం పెరిగింది.

English summary

కరోనా: దేశవ్యాప్తంగా 5 నెలల కనిష్టానికి పడిపోయిన విద్యుత్ వినియోగం | electricity demand falls to 5 month low after lockdown

National electricity demand fell to 2.78 billion units on March 25, the first day of the three-week total shutdown called by Prime Minister Narendra Modi late on Tuesday.
Story first published: Friday, March 27, 2020, 18:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X