For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఎనిమిది కీలక పరిశ్రమల్లో 15శాతం మేరా తగ్గిన ఉత్పత్తి.. కారణం ఇదే..!

|

బొగ్గు, ముడి చమురు, మరియు సహజ వాయువు, స్టీల్ మరియు కరెంట్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆ ప్రభావం 8 కీలక రంగాలపై చూపింది. దీంతో జూన్ నెలలో ఈ ఎనిమిది కీలక రంగాలకు సంబంధించిన ఉత్పత్తి 15శాతం మేరా తగ్గిపోయింది. ఇలా తగ్గిపోవడం వరుసగా ఇది నాలుగో నెలకావడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది.

బొగ్గు ఉత్పత్తి శాతం 15.5 శాతం తగ్గిపోగా, క్రూడ్ ఆయిల్ 6శాతం, సహజ గ్యాస్ 12శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 8.9శాతం, స్టీల్ 33.8శాతం,సిమెంట్ 6.9శాతం, కరెంటు 11శాతం మేరా ఉత్పత్తి తగ్గిపోయింది. మే నెలలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 22శాతంమేరా క్షీణించింది. ఒక్క ఫెర్టిలైజర్ల రంగంలో తప్ప మిగతా ఏడు రంగాల్లో మే నెలలో ఉత్పత్తి విషయంలో క్షీణత కనిపించింది. మార్చి నెలలో 6.5శాతం మేరా తగ్గిపోగా ఏప్రిల్‌లో అత్యధికంగా 38శాతం మేరా ఉత్పత్తి తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే 8 కీలక రంగాలు గతేడాది జూన్ నెలలో 1.2శాతం మేరా పెరిగాయి.

Eight core industries output contracts 15% in June,for the fourth straight month

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ -జూన్ నెలకుగాను కీలక రంగాల్లో ఉత్పత్తిలో 24.6శాతం తగ్గుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలకు పోలిస్తే 3.4శాతం పెరుగుదల కనిపించింది. పరిశ్రమల ఉత్పత్తి సూచికపై ఈ కీలక ఎనిమిది రంగాలు 40.27శాతం దోహదం చేస్తాయి. ప్రధాన రంగ పరిశ్రమలతో కలిసి సరుకు రవాణా,ఇంధన వినియోగం మరియు జీఎస్టీ సూచికలు మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక నమోదు చేసినఅసమాన మెరుగుదల జూన్ నెలకు కూడా కొనసాగుతుందని సూచించాయి. కానీ ఆయా రంగాల్లో ఆ నెలలో ఆ స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉత్పత్తి జరగకపోవడం, పట్టణప్రాంతాల్లో ఉన్న ఉత్పత్తితోనే సర్దుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

English summary

ఆ ఎనిమిది కీలక పరిశ్రమల్లో 15శాతం మేరా తగ్గిన ఉత్పత్తి.. కారణం ఇదే..! | Eight core industries output contracts 15% in June,for the fourth straight month

Output of eight core industries contracted by 15 per cent in June on account of decline in production of coal, crude oil, natural gas, steel, cement and electricity.
Story first published: Saturday, August 1, 2020, 13:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X