For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Edible Oil Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు..

|

Edible Oil Prices: పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలకు పెద్ద శుభవార్త. గత వారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశంలోని నూనెగింజల మార్కెట్లో సైతం ఆ ప్రభావం కనిపించింది. దీల్లీ మార్కెట్లో ఆవాలు, సోయా, వేరుశనగ సహా మరిన్ని నూనె గింజల ధరలు పడిపోయాయి.

దేశీయ రైతుల పరిస్థితి..

దేశీయ రైతుల పరిస్థితి..

విదేశీ నూనెల ధరలు క్షీణించటం దేశీయ నూనె గింజల ధగలను దెబ్బతీస్తోందని రైతులు వాపోతున్నారు. ఇది సకాలంలో పరిష్కరించకుంటే క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఎందుకంటే దేశీయ నూనెల ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉందని మిల్లర్లు అంటున్నారు. చౌకగా ఉన్న విదేశీ నూనెను దిగుమతికి అలవాటు పడితే దేశీయంగా నూనెగింజలను సాగుచేసే రైతులు వాటికి దూరమౌతారాని వారు అంటున్నారు.

దేశంలో సాగు పెంపు..

దేశంలో సాగు పెంపు..

ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో పామ్ సాగును పెంచాలని పలువురు నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసిందని వర్గాలు తెలిపాయి. దేశీయంగా పౌల్ట్రీ, డెయిరీ రంగాల వారు నూనె తీసిన కేకును దాణాగా వినియోగిస్తారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.

కోటా వ్యవస్థ..

కోటా వ్యవస్థ..

ఎడిబుల్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకునేందుకు 'కోటా వ్యవస్థ'కు స్వస్తి పలకడంపై ప్రభుత్వం ఆలోచించాలని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దిగుమతి చేసుకున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పటికే కిలో రూ.50 కంటే తక్కువగా ఉండగా, ఆవాలు క్వింటాకు రూ.175 తగ్గి రూ.7,100-7,150 వద్ద ఉంది. అలాగే సోయాబీన్ ధరలు సైతం తగ్గి ప్రస్తుతం క్వింటాలుకు రూ.5,260-5,310 ఉన్నాయి. ఇదే సమయంలో వేరుశనగ ధర క్వింటాలుకు రూ.150 తగ్గి రూ.6,360-6,420 వద్ద ఉంది. గుజరాత్‌లో వేరుశెనగ నూనె క్వింటాల్‌కు రూ.150 తగ్గి రూ.14,800కి పడిపోయింది.

పెరుగుతున్న ధరల ఒత్తిడి..

పెరుగుతున్న ధరల ఒత్తిడి..

విదేశీ చమురు ధరల తగ్గుదల ఒత్తిడితో సీపీఓ, పామోలిన్ ఆయిల్ ధరలు కూడా తగ్గాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత వారంలో ముడి పామాయిల్ (సీపీఓ)రూ.500 తగ్గి క్వింటాల్ రూ.8,450 వద్ద ముగిసింది. పామోలిన్ దిల్లీ మార్కెట్లో సైతం రూ.500 తగ్గి రూ.9,950కి చేరుకోగా, పామోలిన్ కండ్ల క్వింటాల్ రూ.600 తగ్గి రూ.9,000 వద్ద ముగిసింది. వంటనూనెల మార్కెట్లో ప్రస్తుతం ధరల ఒత్తిడి కొనసాగుతోంది. కాటన్ సీడ్ ఆయిల్ సైతం తగ్గుదల నమోదు చేసింది. వ్యాపారులు సైతం తగ్గిన ధరలను వినియోగదారులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

Edible Oil Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు.. | Edible Oil prices reduced in international markets soon passed over to retail users

Edible Oil prices reduced in international markets soon passed over to retail users
Story first published: Sunday, December 4, 2022, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X