For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొజాంబిక్‌లో పెట్టుబడులు: ఆ కార్పొరేట్ ప్రమోటర్లకు ఈడీ బిగ్ షాక్: ముంబైలో దాడులు

|

ముంబై: ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ముంబైలోని వారి నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు మొదలు పెట్టారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతోన్నాయి. వీడియోకాన్ ప్రమోటర్లు విదేశాల్లో ఏర్పాటు చేసుకున్న కార్యాలయాలపైనా నిఘా ఉంచారు. వాటికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రకటన ఈ సాయంత్రానికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మనీ ల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ దాడులకు పూనుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మొజాంబిక్‌లో చమురు, సహజవాయు రంగంలో పెట్టుబడులు పెట్టారంటూ వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ దాడులకు దిగినట్లు సమాచారం.

ED conducted searches against the promoters of the Videocon group in Mumbai

వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన వీడియోకాన్ హైడ్రోకార్బన్స్ హోల్డింగ్ లిమిటెడ్.. మొజాంబిక్‌లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ బ్లాక్‌కు సంబంధించిన రొవుమా ఏరియా 1ను కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన అనడార్కో కంపెనీలో 10 శాతం మేర వాటాలను తీసుకుంది. అనంతరం దీన్ని ఓఎన్‌జీసీకి చెందిన విదేశ్ లిమిటెడ్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కొనుగోలు చేసింది. మొజాంబిక్ బ్లాక్‌ను కొనుగోలు చేయడంలో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఇదివరకు సీబీఐ దాడులు సైతం చేపట్టింది. కేసులు నమోదు చేసింది.

అదే మనీ లాండరింగ్ వ్యవహారంలో తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేస్తోన్నారు. ముంబైలోని వీడియోకాన్ ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు దిగారు. ఈ దాడులు కొనసాగుతోన్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ దాడులను చేపట్టినట్లు ఈడీ అధికార వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. ప్రమోటర్ల మీద దాడులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన వేణుగోపాల్ ధూత్, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లు ఇదివరకే మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

English summary

మొజాంబిక్‌లో పెట్టుబడులు: ఆ కార్పొరేట్ ప్రమోటర్లకు ఈడీ బిగ్ షాక్: ముంబైలో దాడులు | ED conducted searches against the promoters of the Videocon group in Mumbai

The ED conducted searches against the promoters of the Videocon group in Mumbai on Friday in connection with its probe against the business house linked to some overseas businesses, official sources said.
Story first published: Saturday, July 17, 2021, 10:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X