For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థికసర్వే: దేశంలోనే తెలంగాణ దూకుడు, ఆంధ్రప్రదేశ్ అందులో ఫస్ట్

|

ఆర్థిక సర్వేలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావన వచ్చింది. ఈ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు బంధు పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం అమలు క్రమాన్ని వివరించింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.4వేలు అందించే వినూత్న పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొంది.

ఎకనమిక్ సర్వే.. మరిన్ని కథనాలు

తెలంగాణ రైతు బంధు

తెలంగాణ రైతు బంధు

2018 ఖరీఫ్ నుంచి దీనిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎకనమిక్ సర్వే పేర్కొంది. ఎకరాకు సీజన్‌కు రూ.4వేలు ఇచ్చారని, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని రూ.5వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే, 16 సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs)లోను తెలంగామణ ముందుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ర్యాంకుల్లో ముందుంది.

కేంద్రం, ఈ రాష్ట్రాలు కూడా

కేంద్రం, ఈ రాష్ట్రాలు కూడా

రైతులకు ఆదాయపరంగా, పెట్టుబడిపరంగా మద్దతు ఇచ్చేందుకు కేంద్రం అమలు చేస్తోన్ని కిసాన్ సమ్మాన్ నిధి, ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తోన్న కాలియా, జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి కృషీ ఆశీర్వాత్ పథకాలను కూడా పేర్కొన్నారు. పీఎం కిసాన్ స్కీం కింద సన్న, చిన్నకారు రైతులకు మూడు విడతల్లో ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నట్లు తెలిపింది.

భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా

భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా

ఒడిశా ప్రభుత్వం కాలియా కింత రైతులకు ఏడాదికి రెండు విడతల్లో రూ.5వేల చొప్పున మొత్తం రూ.10వేలు, భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12,500 ఇస్తున్నట్లు తెలిపింది. వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు ఏడాదికి రూ.10వేలు ఇస్తోంది. జార్ఖండ్ ప్రభుత్వం మెట్ట భూములకు గరిష్టంగా అయిదు ఎకరాల వరకు ఏడాదికి రూ.5వేల చొప్పున ఇస్తోన్న విషయాన్ని తెలిపింది.

ఏపీ, తెలంగాణ సూపర్

ఏపీ, తెలంగాణ సూపర్

- సుస్థిర లక్ష్యాలను సాధిస్తున్న రాష్ట్రాల్లో కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, సిక్కిం, చండీగఢ్, పుదుచ్చేరి వరుసగా ఉన్నాయి.

- 2019 లెక్కల ప్రకారం అదనపు అటవీ విస్తరణతో ఏపీ రెండో స్థానంలో ఉంది.

ఏపీ.. తెలంగాణ నెంబర్ వన్

ఏపీ.. తెలంగాణ నెంబర్ వన్

- చేపల ఉత్పత్తిలో ఏపీ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. ఏపీకి సమీపంలో ఏ రాష్ట్రం కూడా లేదు.

- వన్ నేషన్, - వన్ కార్డ్ కింద ఇంటర్ స్టేట్ పోర్టబులిటీ అమలవుతున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి.

- గత అయిదేళ్లలో సగటున 11.2 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత కర్ణాటక 10.5 శాతం, ఏపీ 9.8 శాతంతో ఉన్నాయి.

NPSలో ఏపీ, తెలుగు రాష్ట్రాల వాటా..

NPSలో ఏపీ, తెలుగు రాష్ట్రాల వాటా..

- పర్యాటకులను ఆకర్షిస్తున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. 2018లో మొత్తం దేశీయ పర్యాటకుల్లో 65 శాతం ఈ రాష్ట్రాలకు వచ్చారు.

- NPS కింద ఏపీలో 1,85,951 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారి మొత్తం కంట్రిబ్యూషన్ రూ.7,946.11 కోట్లు. దాని యాజమాన్యంలోని ఆస్తుల విలువ రూ.10,408.51 కోట్లు. తెలంగాణలో NPS సబ్‌స్రైబర్ల సంఖ్య 1,53,764. వీరి మొత్తం చందా రూ.5,449.12 కోట్లు. ఆస్తులు రూ.7,373.21 కోట్లు.

English summary

ఆర్థికసర్వే: దేశంలోనే తెలంగాణ దూకుడు, ఆంధ్రప్రదేశ్ అందులో ఫస్ట్ | Economic Survey: Telangana frontrunner in sustainable development goals, AP in fisheries

Telangana is the front runner in achieving 16 Sustainable Development Goals (SDGs), the Economic Survey said. The States/UTs were ranked based on their aggregate performance across the 16 SDGs.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X