కరోనా వైరస్ జీవనపరిస్థితులను మార్చివేసింది. ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది ఇప్పుడు ఆచితూచి ఖర్చులు చేస్తున్నారట. ఈ మేరకు బ్రిటిష్ లెంటర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు సర్వేలో వెల్లడైంది. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందని, ఆర్థిక రికవరీలోను తీవ్ర అనిశ్చితి నెలకొందని తేలింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజల వ్యయధోరణులపై సర్వే నిర్వహించింది. బ్రిటన్, హాంగ్‌కాంగ్, భారత్, ఇండోనేసియా, కెన్యా, చైనా, మలేషియా, పాకిస్తాన్, సింగపూర్, తైవాన్, యూఏఈ, అమెరికాలలో ఆన్‌లైన్ మార్గంలో సర్వే నిర్వహించింది. కరోనా ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులు, ఆ మార్పు వారిలో ఎలా ఉంది, ఎంతకాలం కొనసాగుతుంది వంటి అంశాలపై సర్వే నిర్వహించారు. జూలైలో మొదటి సర్వే నిర్వహించారు. ఇది రెండోది. మొత్తం మూడు సర్వేలు నిర్వహిస్తున్నారు. తాజా రెండో సర్వే ప్రకారం...

ఖర్చులో.. ప్రపంచంలోనే భారతీయుల అప్రమత్తత ఎక్కువ
ఉద్యోగాలు, ఆర్థిక రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో పది పది మందిలో తొమ్మిది మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని, ఆచితూచి ఖర్చులు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. అంటే మన దేశంలో 90 శాతంగా ఉంటే, అంతర్జాతీయంగా ఇది 75 శాతంగా మాత్రమే ఉంది. కరోనా కారణంగా ఖర్చులపై జాగ్రత్త పెరిగింది. ఖర్చులు ఆచితూచి చేస్తున్నట్లు 76 శాతం మంది భారతీయులు చెప్పగా, అంతర్జాతీయంగా 62 శాతం ఉంది. ఖర్చులకు కళ్లెం వేసేందుకు 80 శాతం మంది కట్టుదిట్టమైన బడ్జెట్ విధానాలను అనుసరిస్తున్నారు.

కరోనా.. ఆన్‌లైన్ సేల్స్ వైపు మనవారి మొగ్గు ఎక్కువే
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు 78 శాతం మంది భారతీయులు చెప్పారు. అంతర్జాతీయ సగటు 66 శాతం మాత్రమే ఉంది. కరోనా మహమ్మారికి ముందు ఆన్ లైన్ కొనుగోలుదారుల సంఖ్య 54 శాతంగా ఉంది. నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ పరికరాలకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి కోసం ఖర్చు ఎక్కువ చేస్తున్నట్లు తెలిపారు.
స్థానికంగా కొనుగోలు చేస్తామని 72 శాతం మంది చెప్పగా, చిన్న వ్యాపారుల నుండి కొనుగోలు చేస్తామని 73 శాతం మంది, తెలిపారు. ఆన్ లైన్ చెల్లింపులు వైపు మొగ్గు చూపుతున్నట్లు 78 శాతం మంది చెప్పారు.

ప్రయాణాలు, విహార యాత్రలు తగ్గించుకుంటాం
కరోనా వైరస్‌కు ముందు సమయంతో పోలిస్తే రాబోయే కాలంలో ప్రయాణాలు, విహార యాత్రలు తగ్గించుకుంటామని 64 శాతం మంది తెలిపారు. ప్రపంచ సగటు కూడా ఇది 64 శాతంగా ఉంది. దుస్తులపై ఖర్చును తగ్గించుకుంటామని 56 శాతం మంది తెలిపారు. ఇది ప్రపంచ సగటు 55 శాతంగా ఉంది. ఎక్స్‌పెన్సెస్ తగ్గిస్తామని 30 శాతం మంది చెప్పగా, ప్రపంచ సగటు 41 శాతంగా ఉంది. కాగా ఈ సర్వేను 12 దేశాల్లో 12,000 మందితో నిర్వహించారు. 2025 నాటికి దాదాపు నగదురహితం అవుతుందని భారత్‌లో 87శాతం మంది చెప్పగా, ప్రపంచవ్యాప్తంగా సగటు 64 శాతం ఉంది.
అమెరికా, బ్రిటన్ మినహా ఇతర దేశాల్లో ఏటీఎం ఉపయోగం క్షీణించింది. ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ రెండేళ్ల క్రితంతో పోలిస్తే సగం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications