For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేందుకు సులభ విధానాలు

|

అత్యవసరంగా డబ్బులు కావాలంటే క్రెడిట్ కార్డు అవసరం ఎంతో ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లును నిర్దిష్ట గడువులోగా చెల్లిస్తే ఎలాంటి నష్టం ఉండదు. కానీ గడువు దాటితే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అంటే చెల్లింపులు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. గడువు దాటితే ముప్పై శాతం నుండి నలభై శాతం వరకు వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్స పైన వడ్డీ లేని సమయాన్ని రద్దు చేయవచ్చు కూడా. అందుకే క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. ఎవరైనా మరిచిపోయే అవకాశం ఉంటే వారికి ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కల్పించే సంస్థలు ఉన్నాయి.

ఈఎంఐ ఆప్షన్‌తో...

ఈఎంఐ ఆప్షన్‌తో...

క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐలోకి మార్చుకోవడానికి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం లేదా అందులో కొంత మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకునే సౌకర్యం ఉంది. దీనిని ఎంచుకోవడం ద్వారా అపరాధ రుసుముల నుండి తప్పించుకోవచ్చు. పెద్ద మొత్తంలోని బిల్లును ఒకేసారి చెల్లించడానికి బదులు ఈఎంఐల రూపంలో చిన్న మొత్తాలుగా చేసి చెల్లింపులు జరపవచ్చు. కార్డు జారీదారు పేర్కొన్న పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆ మొత్తాన్ని ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.

ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే

ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే

నిర్దిష్ట కార్డు ట్రాన్సాక్షన్స్‌ను ముఖ్యంగా పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఒక క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌ను. మరొక సంస్థ జారీ చేసిన కార్డుకు బదలీ చేసి దానిని ఈఎంఐగా మార్చుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఈఎంఐపై వర్తించే వడ్డీ రేటు తక్కువ. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే కూడా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.

ఆ తర్వాత నిర్ణయం

ఆ తర్వాత నిర్ణయం

ఎక్కువ కార్డులు ఉన్నవారు ఈఎంఐలుగా మార్చుకోకుండా కార్డులను బదలీ చేసుకోవచ్చు. ఇతర కార్డుకు బదలీపై ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ వడ్డీ రేట్లను సరిపోల్చుకోవాలి. ఆ తర్వాత ఇతర క్రెడిట్ కార్డులకు బిల్లు మార్చుకోవడం లేదా ఈఎంఐ కింద చెల్లించడంపై నిర్ణయం తీసుకోవాలి.

English summary

క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేందుకు సులభ విధానాలు | Easy steps to credit card bill payment

Best Ways to Pay Your Credit Card bills. Failing to repay the entire credit card bill by the due date will incur finance charges on the unpaid bill.
Story first published: Wednesday, June 23, 2021, 20:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X