For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ నుంచి టీవీ విత్ అలెక్సా: రిమోట్ వెతుక్కునే పని ఉండదిక

|

ముంబై: అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఇక ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌లో అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే- మొబైల్ తయారీ కంపెనీల తరహాలోనే కొత్త పంథాను ఎంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో మొబైల్ బ్రాండింగ్ కంపెనీలుగా గుర్తింపు పొందిన షావోమి, మైక్రోమాక్స్, ఎల్జీ, శాంసంగ్ వంటి టాప్ ఎలక్ట్రానిక్ కంపెనీలు టెలివిజన్ సెట్లను కూడా తయారు చేస్తోన్నాయి. అదే తరహాలో ఇక అమెజాన్ కూడా ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. తొలిదశలో టెలివిజన్ సెట్లను ఉత్పత్తి చేయబోతోంది.

అలెక్సా ఫెసిలిటీతో..

అలెక్సా ఫెసిలిటీతో..

అలెక్సా ఫెసిలిటీ ఉన్న టీవీలను అమెజాన్ అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. థర్డ్ పార్టీ ద్వారా టెలివిజన్ సెట్లను తయారు చేయిస్తోంది. బ్రాండింగ్ మాత్రం అమెజాన్‌దే. అమెజాన్ టీవీలను తయారు చేసే థర్డ్ పార్టీగా టీసీఎల్ వంటి కంపెనీలు ఉండబోతోన్నాయి. టీసీఎల్‌కు చెందిన టీవీలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ నాటికి అమెజాన్ టీవీ మార్కెట్‌లోకి రానున్నాయి. తొలుత- అమెరికా మార్కెట్‌లో వాటిని విడుదల చేయాలనేది అమెజాన్ మేనేజ్‌మెంట్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా చెబుతున్నారు.

55 నుంచి 75 ఇంచుల్లో..

55 నుంచి 75 ఇంచుల్లో..

ఈ సంవత్సరం చివరి నాటికి దేశీయ మార్కెట్‌లో అమెజాన్ టీవీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. టీవీ సైజ్ 55 నుంచి 75 ఇంచ్‌లుగా నిర్ధారించింది. భారత్‌లో అమెజాన్ బేసిక్స్ బ్రాండెడ్ టీవీలను ప్రవేశపెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. వాటితో పాటు అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్‌వేర్ గల తోషిబా, ఇన్‌సైనియా టీవీలను బెస్ట్ బై ద్వారా విక్రయించాలని అమెజాన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అడాప్టివ్ వాల్యూమ్

అడాప్టివ్ వాల్యూమ్

అడాప్టివ్ వాల్యూమ్ పేరుతో కొత్త ఫీచర్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు టెక్ వెబ్‌సైట్స్ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. నాయిస్ బ్యాక్‌గ్రౌండ్‌ను గుర్తించేలా దీన్ని డెవలప్ చేస్తోందని పేర్కొన్నాయి. గూగుల్ డెవలప్ చేసిన అలెక్సా తరహాలోనే ఈ డివైజ్ కూడా పని చేస్తుందని తెలిపాయి. రిమోట్ కంట్రోల్ అవసరం లేని విధంగా భవిష్యత్‌లో అమెజాన్ తన బ్రాండెడ్ టీవీలను డెవలప్ చేయడానికే ఈ అడాప్టివ్ వాల్యూమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

టీవీ అమ్మకాల్లో పోటీ..

టీవీ అమ్మకాల్లో పోటీ..

టీవీ సెక్టార్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున పోటీ నెలకొని ఉంది. ఎల్జీ, శాంసంగ్, సోనీ, పానసోనిక్ వంటి కంపెనీల పేర్లు చాలాకాలం నుంచీ మనం వింటూనే వస్తోన్నాం. స్మార్ట్‌ఫోన్ డెవలపర్ కంపెనీలు మైక్రోమాక్స్, షావోమి కూడా టీవీ సెక్టార్‌లో అడుగు పెట్టాయి. ఎల్జీ, శాంసంగ్‌లో పోల్చుకుంటే కాస్త తక్కువ ధరకే మైక్రోమాక్స్, షావోమి కంపెనీలకు చెందిన టీవీ సెట్స్ మార్కెట్‌లో లభిస్తోన్నాయి. ఇక తాజాగా అమెజాన్ కూడా ఇదే సెక్టార్‌లో అడుగు పెడితే.. ఆరోగ్యకర పోటీ నెలకొంటుందని అంటోన్నారు.

English summary

అమెజాన్ నుంచి టీవీ విత్ అలెక్సా: రిమోట్ వెతుక్కునే పని ఉండదిక | e-commerce giant Amazon likley to launch its own TV with Alexa by October: Report

The e-commerce giant Amazon is reportedly preparing to launch its own branded TVs, possibly as soon as October.
Story first published: Saturday, September 4, 2021, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X