For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ-కామర్స్ కంపెనీలు, బ్యాంకులకు షాక్ : కస్టమర్లు ఏం చేశారో తెలుసా?

|

దేశీయంగా ఈ-కామర్స్, బ్యాంకింగ్, టెలీకాం కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనాభా పెరుగుతున్న కొద్దీ ఖాతాదారుల సంఖ్య పెరగడం సహజమేకదా. ఇలాంటప్పుడు ఈ సంస్థలు కూడా తమ కస్టమర్లకు తగిన విధంగా సేవలు అందించడమే కాకుండా సమస్యలు వచ్చినప్పుడు వాటిని వీలైనంత వేగవంతంగా పరిష్కరించాలి. కాకపోతే వారికి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కస్టమర్లు తమకు సమస్య వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు మొదట ఫిర్యాదు చేస్తుంటారు. అయితే కొన్ని సంస్థలు వీటిని పరిష్కరించడంపై ఆ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపవు. లేదా ఎక్కువ జాప్యం చేస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో కస్టమర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఒక జాతీయ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. దీనికి ఫిర్యాదు చేస్తే త్వరగా సమస్యను పరిష్కారం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ హెల్ప్ లైన్ కు విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆవివరాలు ఏమిటంటే...

 ఈ- కామర్స్ కంపెనీలపైనే ఎక్కువ

ఈ- కామర్స్ కంపెనీలపైనే ఎక్కువ

* వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ- కామర్స్ కంపెనీల వినియోగదారులే ఎక్కువగా ఫిర్యాదు చేశారు.

* ఈ కంపెనీల్లో ఎక్కువగా ఫ్లిప్ కార్ట్ పై పిర్యాదులొచ్చాయి. ఫిర్యాదుల జాబితాలో ఫ్లిప్ కార్ట్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం గమనార్హం.

* ఐదు ఫిర్యాదుల్లో ఒకటి ఈ-కామర్స్ కంపెనీపై వచ్చింది.

* ఈ-కామర్స్ తో పాటు బ్యాంకింగ్, టెలికామ్ రంగ కంపెనీలపై కూడా ఎక్కువగానే ఫిర్యాదులు వచ్చాయి.

టాప్ 5 కంపెనీలు ఇవే...

టాప్ 5 కంపెనీలు ఇవే...

వినియోగదారుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన టాప్ 5 కంపెనీల్లో

* ఫ్లిప్ కార్ట్

* రిలయన్స్ జియో

* అమెజాన్

* ఎస్ బీ ఐ

* వొడాఫోన్

* ఎయిర్ టెల్

50 లక్షలకు పైగా ఫిర్యాదులు

50 లక్షలకు పైగా ఫిర్యాదులు

* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీలపై 50 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే కంపెనీల సర్వీసులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు

* ఈ ఫిర్యాదుల్లో లక్షకు పైగా ఫిర్యాదులు ఈ-కామర్స్ కంపెనీలపై వచ్చాయి.

* బ్యాంకులపై 41,600, టెలికాం కంపెనీలపై 29,400 ఫిర్యాదులు వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీలపై 5.65 లక్షల ఫిర్యాదులు రాగా వీటిలో లక్షకు పైగా ఫిర్యాదులు ఈ - కామర్స్ కంపెనీలపై ఉన్నాయి.

* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఇంకా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ - కామర్స్ కంపెనీలపై వస్తున్న ఫిర్యాదులు ఏమిటంటే...

* ఈ- కామర్స్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన ఉత్పత్తులు సరిగ్గా ఉండకపోవడం, ఆర్దరు చేసినవి డెలివరీ కావడంలో జాప్యం కావడం, ఒక వస్తువుకు బదులు మరొకరి డెలివరీ కావడం తదితర ఫిర్యాదులున్నాయి.

* టెలికం కంపెనీల విషయానికి వస్తే అధికంగా బిల్లు వేయడం, డేటా తగ్గించడం, కనెక్టివిటీ సమస్యలు వంటివి ఉన్నాయి.

 రెండు నెలల్లో పరిష్కారం

రెండు నెలల్లో పరిష్కారం

* వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకుగాను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక మొబైల్ యాప్ తెచ్చింది. దీని ద్వారా ఫిర్యాదు చేస్తే 60 రోజుల్లో పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

English summary

ఈ-కామర్స్ కంపెనీలు, బ్యాంకులకు షాక్ : కస్టమర్లు ఏం చేశారో తెలుసా? | E-commerce companies facing lot of compalints from their customers

Consumer complaints are rapidly increasing on Ecommerce, banking, telecom and other companies of their services. Consumer complaints are more on E-commerce companies. Flipkart received more complains among the ecommerce companies according to the data of Ministry of consumer affairs.
Story first published: Monday, November 18, 2019, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X