ఏం జరుగుతుందో చూద్దాం: టిక్‌టాక్‌పై తేల్చిచెప్పిన ట్రంప్
చైనా కంపెనీలకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌కు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. టిక్‌టాక్‌కు విధించిన గడువు పొడిగింపు ఉండదని, ఇచ్చిన గడువులోగా దానిని ఇతరులు కొనుగోలు చేయడమో లేదా మూసివేయడమో జరగాల్సిందేనని ట్రంప్ అన్నారు. టిక్‌టాక్‌కు ఇచ్చిన గడువును పొడిగిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా, ట్రంప్ పైవిధంగా స్పందించారు.
అమెజాన్ జెఫ్ బెజోస్‌కు రిలయన్స్ ముఖేష్ అంబానీ భారీ ఆఫర్!

బైట్ డ్యాన్స్ తీవ్ర ప్రయత్నాలు
బైట్‌డ్యాన్స్ నేతృత్వంలోని టిక్‌టాక్ కార్యకలాపాల విక్రయం కోసం మూడు నెలల గడువు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడి ఆదేశాల నేపథ్యంలో బైట్ డ్యాన్స్ కొనుగోలుదారులను వెతుకుతోంది. కరోనా మహమ్మారి తర్వాత భద్రతా కారణాలతో వందలాది చైనీస్ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఇందులో టిక్ టాక్ కూడా ఉంది. ట్రంప్ కూడా నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరికొన్ని దేశాలు అదే ఆలోచన చేస్తున్నాయి. ప్రధానంగా అమెరికాలో నిషేధం కత్తి వేలాడుతోంది. దీంతో ఇక్కడి కార్యకలాపాలు విక్రయించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

సెప్టెంబర్ 15 వరకు వకాశం
గడువును పొడిగించేది లేదని, సెప్టెంబర్ 15వ తేదీ వరకే అవకాశం ఉందని ట్రంప్ గురువారం తేల్చి చెప్పారు. ఏం జరుగుతుందో చూద్దామని, ఇది మూసివేస్తారా విక్రయిస్తారా చూద్దామన్నారు. భద్రతా కారణాల వల్ల ఈ చైనా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించనున్నట్లు తెలిపారు. కాగా, టిక్ టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.

చైనాకు యూజర్ల సమాచారం
టిక్ టాక్‌ను వినియోగించే యూజర్ల సమాచారం చైనాకు చేరుతోందని, వారి సమాచార భద్రతపై అమెరికా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను నిలిపివేయాలని లేదా అమెరికా సంస్థకు విక్రయించాలని ట్రంప్ ఆదేశించారు. వినియోగదారుల సమాచారం భద్రంగా ఉందని టిక్ టాక్ చెబుతోంది. కానీ, భారత్, అమెరికా సహా ఏ దేశాలు ఈ మాటలను విశ్వసించడం లేదు.