For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదే డొనాల్డ్ ట్రంప్ టార్గెట్, చైనా హువావేకు అమెరికా భారీ షాక్

|

అమెరికా అధ్యక్ష పదవి నుండి దిగిపోయే ఒకరోజు ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ చైనాకు షాకిచ్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు యాప్స్ పైన నిషేధం విధించిన ట్రంప్ తాజాగా మరో చర్యకు సిద్ధమవుతున్నారు. చైనాని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. గతంలోనే హువేవేను టార్గెట్ చేసిన ఆయన, తాజాగా మరోసారి విరుచుకుపడుతున్నారు. ఈ చైనా టెలికం దిగ్గజం 5G టెక్నాలజీకి ప్రసిద్ధి. అమెరికాలోను పలు దిగ్గజ కంపెనీలకు హువావే పరికరాలు సరఫరా చేస్తుంది. ఈ దిశగా ట్రంప్ చర్యలు తీసుకోనున్నారు.

అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్

అదే ట్రంప్ టార్గెట్

అదే ట్రంప్ టార్గెట్

ఇంటెల్ సహా ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హువావేకు పరికరాలు సరఫరా చేస్తాయి. ఇందుకు సంబంధించిన అనుమతులను రద్దు చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఎగుమతుల కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులను కూడా తిరస్కరించే యోచనలో ఉన్నారు. దాదాపు 150 అనుమతులను ట్రంప్ రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ దాదాపు 120 బిలియన్ డాలర్లు. మరో 280 బిలియన్ డాలర్ల ఒప్పందాల కోసం చర్చలు జరుగుతుండగా, ట్రంప్ చర్యలతో వీటిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. హువావేకు అమెరికా నుండి ఎలాంటి పరికరాలు అందవద్దనేది ట్రంప్ టార్గెట్‌గా కనిపిస్తోంది.

ట్రంప్ పిలుపు.. యూకే రద్దు

ట్రంప్ పిలుపు.. యూకే రద్దు

హువావే టార్గెట్‌గా పలు అమెరికా కంపెనీలకు అమెరికా వాణిజ్య శాఖ నోటీసులు ఇచ్చింది. ఇరవై రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. 5G టెక్నాలజీకి సంబంధించి హువావే ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని భావిస్తోంది. ట్రంప్ ఆ సంస్థకు కొరకురాని కొయ్యలా మారారు. చైనా కంపెనీలు, టెక్నాలజీ వల్ల సమాచార దోపిడీ ఉందని ఆరోపిస్తూ వస్తున్నారు. హువావేను బహిష్కరించాలని ఇతర దేశాలను కూడా కోరారు. దీంతో హువావేతో ఉన్న ఒప్పందాన్ని ఇప్పటికే బ్రిటన్ రద్దు చేసుకుంది.

లైసెన్స్ రద్దు

లైసెన్స్ రద్దు

ఇందుకు సంబంధించి ఇంటెల్ కార్ప్ సహా ఇతర సంస్థలు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు సంస్థలకు చెందిన ఎనిమిది లైసెన్స్ రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. జపానీస్ ఫ్లాష్ మెమోరీ చిప్ మేకర్ కియోక్సియా కార్ప్‌కు సంబంధించి ఒక లైసెన్స్ రద్దయినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ కంపెనీ తోషిబా మెమోరీ కార్ప్ పేరుతో ఉంది. దీనిపై ఈ కంపెనీ స్పందించాల్సి ఉంది.

English summary

అదే డొనాల్డ్ ట్రంప్ టార్గెట్, చైనా హువావేకు అమెరికా భారీ షాక్ | Donald Trump halts Huawei supply in final China blow

The Trump administration notified Huawei suppliers, including chipmaker Intel, that it is revoking certain licenses to sell to the Chinese company and intends to reject dozens of other applications to supply the telecommunications firm.
Story first published: Monday, January 18, 2021, 14:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X