For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనీస్ టిక్‌టాక్‌కు మరింత ఊరటనిచ్చిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం

|

అమెరికా సహా వివిధ దేశాలకు చెందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కార్యకలాపాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని పక్షం రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అధ్యక్షులు ట్రంప్ దృష్టికి తీసుకు వెళ్లారు. యాప్ భద్రత, పనితీరు, కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాల్ని వివరించారు. ట్రంప్ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నామని, వాటికి సరైన పరిష్కారం లభించే విధంగా కొనుగోలు ఒప్పందం ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ టిక్‌టాక్ కొనుగోలుకు సంబంధించి మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు కూడా విధించారు. అయితే ఇప్పుడు దానిని పొడిగించారు.

సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు!సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు!

నవంబర్ 12 వరకు గడువు పొడిగింపు

నవంబర్ 12 వరకు గడువు పొడిగింపు

తొలుత ఆగస్ట్ ప్రారంభంలో 45 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు దానిని 90 రోజులకు నవంబర్ 12వ తేదీకి పొడిగించారు. ఈ మేరకు మరోసారి కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. మూడు నెలల పాటు పొడిగింపు అంటే ఆ తర్వాత అధికార మార్పు జరిగితే పరిణామాలు మరో రకంగా ఉంటాయి.

అమెరికా జాతీయ భద్రత

అమెరికా జాతీయ భద్రత

ఈ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్ అమ్మకం ప్రక్రియను బైట్ డ్యాన్స్ పూర్తి చేయాలి. అమెరికన్ యూజర్ల డేటాను పూర్తిగా తొలగించాలి. అమెరికా జాతీయ భద్రతను బైట్ డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తోందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ కూడా కొనుగోలుకు ఆసక్తిగా ఉంది. మరోవైపు, భారత టిక్ టాక్ కార్యకలాపాల కొనుగోలుకు రిలయన్స్‌తో చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

50 బిలియన్ డాలర్ల అంచనా

50 బిలియన్ డాలర్ల అంచనా

టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఎంత చెల్లించనుందో తెలియాల్సి ఉంది. బైట్ డ్యాన్స్ ఈ యాప్ వ్యాల్యుయేషన్ 50 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోందట. అమెరికాలో టిక్‌టాక్‌కు 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు. టిక్‌టాక్ కొనుగోలు చేస్తే సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్ ఇంక్, స్నాప్ ఇంక్‌లకు మైక్రోసాఫ్ట్ ఈ విభాగంలో పెద్ద కాంపిటీటర్ కానుంది. ఈ సంస్థకు ఇప్పటికే లింక్డిన్ ఉంది. అవసరమైతే టిక్‌టాక్ కొనుగోలుకు ఇతర అమెరికా మైనార్టీ ఇన్వెస్టర్లను కూడా మైక్రోసాఫ్ట్ ఆహ్వానించనుంది. చైనాను మినహాయించి బైట్ డ్యాన్స్‌కు బయటి వస్తున్న 70 శాతం ఆదాయం అమెరికా నుండి కావడం గమనార్హం.

English summary

చైనీస్ టిక్‌టాక్‌కు మరింత ఊరటనిచ్చిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం | Donald Trump gives TikTok a new deadline for 90 days instead of 45

President Trump issued an executive order Friday giving ByteDance 90 days to either sell or spin off its TikTok business in the US.
Story first published: Sunday, August 16, 2020, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X