For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్రం అందుకు గ్రీన్ సిగ్నల్..జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లిన దేశీ ఎయిర్‌లైన్స్ స్టాక్స్..!!

|

దేశీయ విమానాయాన సంస్థలు తమ విమానంలో 65శాతం ప్రయాణికుల సామర్థ్యంతో నడపొచ్చని పౌరవిమానాయానశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్ మరియు స్పైస్ జెట్ స్టాక్‌లు ఒక్కసారిగా 2 శాతం మేరా పెరిగాయి. కేంద్ర విమానాయానశాఖ నుంచి 65శాతం ప్రయాణికు సామర్థ్యంతో దేశవ్యాప్తంగా విమానాలను తిప్పుకోవచ్చని ప్రకటన సోమవారం సాయంత్రం వెలువడగానే జూలై 6వ తేదీ ఉదయం మార్కెట్లు ప్రారంభం అవగానే ఈ స్టాక్‌లు పెరిగాయి.

ఇక కరోనా కారణంగా కేవలం 50శాతం కెపాసిటీతోనే విమానాలు నడపాలని అంతకుముందు ప్రకటించిన కేంద్రం జూలై 5వ తేదీన దీన్ని 65శాతంకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది జూలై 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్లీ ప్రకటన చేస్తామని కేంద్రం వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభించని నేపథ్యంలో చాలా విమానాయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఇక దేశీయ విమానాయాన రంగాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర పౌరవిమానాయానశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దేశీయ విమానాల్లో రోజువారి సీటింగ్ కెపాసిటీ 1,60,000 మందికి పెరిగింది. ఈ వారాంతంలోగ 1,70,000 మందికి పెరగొచ్చని అంచనా ఉంది.

Domestic Airlines stocks taste a gain of 2 percent after centre allows to increase passenger capacity

ఇక కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడంతో ప్యాసింజర్ ట్రాఫిక్ లక్షకు పడిపోయింది. కరోనా విజృంభించిన వేళ కట్టడి చేసేందుకు విమానాయాన సంస్థలపై ఆంక్షలు విధించింది కేంద్రం. అప్పటి వరకు 80శాతం మేరా విమానాలు ఆపరేట్ అవుతుండగా వాటిని 50శాతంకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.దీంతో ఆయా విమానాయాన సంస్థలకు భారీగా నష్టం వాటిల్లింది.

ఇక దేశీయ విమానాయాన సంస్థల స్టాక్ పరిస్థితి గమనిస్తే... స్పైస్ జెట్ స్టాక్స్ 1.58 శాతం మేరా పెరిగాయి లేదా రూ.1.25 మేరా పెరిగిందని చెప్పొచ్చు. గరిష్టంగా రూ.82 మార్కను తాకగా... కనిష్టంగా 80.80 మధ్య మంగళవారం ట్రేడ్ అయ్యింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థ స్టాక్స్ 1.72శాతం మేరా పెరిగాయి. అంటే రూ.30.30 మేరా పెరిగాయి. మంగళవారం ట్రేడింగ్ సమయంలో గరిష్టంగా రూ. 1804.10 మార్క్‌ను టచ్ చేయగా కనిష్టంగా రూ.1763ని తాకింది. ఈ రెండిటి మధ్యే ట్రేడ్ అయ్యింది. ఇక గ్లోబల్ వెక్ట్రా షేర్లు 2.09శాతంమేరా పెరిగాయి. మంగళవారం ఉదయం 11 గంటల 12 నిమిషాల సమయానికి దీని విలువ రూ.5120గా ఉన్నింది.

English summary

కేంద్రం అందుకు గ్రీన్ సిగ్నల్..జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లిన దేశీ ఎయిర్‌లైన్స్ స్టాక్స్..!! | Domestic Airlines stocks taste a gain of 2 percent after centre allows to increase passenger capacity

With Govt announcing that Domestic airlines can operate with 65 percent seating capacity, the shares of domestic airlines grew by 2percent.
Story first published: Tuesday, July 6, 2021, 14:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X