For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోజికాయిన్, సోలానా 8 శాతం జంప్, టాప్ 15లోకి షిబాఅను

|

క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ మళ్లీ పెరుగుతోంది. గతవారం చివరలో తగ్గిన వివిధ క్రిప్టోలు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ లాభపడింది. డోజీకాయిన్, సోలానా ఎనిమిది శాతం చొప్పున లాభపడ్డాయి. షిబా ఇను టాప్ 15 జాబితాలోకి వచ్చింది. బిట్ కాయిన్ వ్యాల్యూ 62,000 డాలర్లకు పైన ఉంది. ఆ తర్వాత 63,500 డాలర్ల స్థాయికి కూడా చేరుకుంది. టాప్ టెన్‌లోని నాలుగు క్రిప్టో కరెన్సీలు లాభాల్లో ఉన్నాయి. ఆరు కరెన్సీలు మాత్రం నష్టపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.58 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 26 శాతంగా ఉంది. బిట్ కాయిన్ 62,000 డాలర్లను క్రాస్ చేయగా, ఎథేరియం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.

ప్రస్తుతం బిట్ కాయిన్ 62వేల డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.47 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయినప్పటికీ, ప్రస్తుతం 62వేల డాలర్లకు పైన ఉంది.

 Dogecoin, Solana zoom 8%; Shiba Inu in top 15 list

నేటి సెషన్‌లో బిట్ కాయిన్ 1.56 శాతం, ఎథేరియం 0.61 శాతం, సోలానా 3.64 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 0.07 శాతం, డోజీకాయిన్ 8.12 శాతం లాభపడ్డాయి. బియాన్స్ కాయిన్ 0.62 శాతం, కార్డానో 0.72 శాతం, టెథేర్ 0.03 శాతం, పోల్కాడాట్ 0.3 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.04 శాతం నష్టపోయాయి.

English summary

డోజికాయిన్, సోలానా 8 శాతం జంప్, టాప్ 15లోకి షిబాఅను | Dogecoin, Solana zoom 8%; Shiba Inu in top 15 list

The crypto cart turned mixed on Monday after a lukewarm weekend as investors booked profits in top gainers. However, Bitcoin was again over the $62,000 mark, after a brief consolidation.
Story first published: Monday, October 25, 2021, 22:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X