ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం బీమా కలిగి ఉన్నాం. ఇన్ష్యూరెన్స్ అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణమైపోయింది. అయితే ఇన్ష్యూరెన్స్ అనేది దీర్ఘకాలంలో ఉండటం వల్ల కొందరు తమకు సాధ్యపడినంత వరకు మాత్రమే బీమా కొనసాగిస్తున్నారు. మధ్యలోనే డబ్బులు చెల్లించకుండా అలాగే వదిలేస్తున్నారు. పాలసీని మధ్యలోనే నిలిపివేసేందుకు చాలా కారణాలు ఉండొచ్చు. డబ్బులు సమయానికి లేకపోవడంతో పాటు ఇతరత్ర ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు. ఇక కొందరైతే పాలసీ సంస్థలు పెట్టే నిబంధనలు, లేదా ఎలా రెన్యూ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ బీమా పాలసీలకు స్వస్తి పలుకుతున్నారు. మధ్యలోనే వదిలేసిన పాలసీలను తిరిగి ఎలా రెన్యూ చేసుకోవాలో తెలుసుకుందాం.
గతంలో ఓ పాలసీని తీసుకుని ఆ తర్వాత మధ్యలో కొనసాగించకపోతే... అదే పాత ప్లాన్‌ను కంటిన్యూ చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మధ్యలో డబ్బులు చెల్లించకుండా వదిలేసినందుకు కొన్ని బెనిఫిట్స్ కోల్పోవచ్చు... కానీ తిరిగి కొనసాగించడమే మంచి నిర్ణయమని చెబుతున్నారు. ఎందుకంటే ఆ పాలసీకి ఇదివరకే ప్రీమియం డబ్బులు చెల్లించి ఉంటారు కాబట్టి అదే కంటిన్యూ చెయడం చాలా బెటర్ అని చెబుతున్నారు. అది కాక.. కొత్త పాలసీ తీసుకుంటే అది ప్రస్తుత పరిస్థితుల్లో కట్టాల్సిన ప్రీమియం పెరిగి ఉండొచ్చు.అదే సమయంలో మీ ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త బాగుండకపోవచ్చు.

ఇక జీవిత బీమా దీర్ఘకాలంలో మంచి పొదుపులానే కాకుండా ఆ సమయానికి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. తొలిసారి కట్టిన ప్రీమియం అలా చివరి వరకు కడుతూ పోతే అదంతా సేవింగ్స్ కిందకే వస్తుంది. అందుకే పాత పాలసీనే కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.పాతది ఆపేసి కొత్త పాలసీ కోసం వెళుతున్నట్లయితే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. పెరిగిన వయస్సుతో పాటు ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇది కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక పాలసీదారుడు ఏ సమయంలోనైనా ఏ కారణంచేతైనా గ్రేస్ పీరియడ్‌లోగా డబ్బులు చెల్లించకపోతే పాలసీ లాప్స్ అవుతుంది. అయితే లాప్స్ అయిన పాలసీని తిరిగి యాక్టివ్ అయ్యేలా మార్చుకోవచ్చు.
పాలసీని యాక్టివ్ చేసుకునేందుకు ముందుగా ప్రీమియంతో పాటు కొంత వడ్డీని పెనాల్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ పాలసీదారుడు తిరిగి తాజాగా మెడికల్ చెకప్ చేసుకున్నట్లయితే ఇన్ష్యూరెన్స్ కంపెనీ కొన్ని మెడికల్ ఛార్జీలు విధించే అవకాశం ఉంది. పాలసీ లాప్స్ అయిన ఆరునెలల్లోగా ఇన్ష్యూరెన్స్ కంపెనీని సంప్రదించి పెనాల్టీ కట్టి తిరిగి ఆ పాలసీని యాక్టివ్‌గా మార్చుకోవచ్చు. ఒక వేళ పాలసీ లాప్స్ అయి ఆరునెలలు దాటితే ముందుగా బాకీ ఉన్న ప్రీమియంతో పాటు 12 నుంచి 18శాతం పెనాల్టీ రూపంలో వడ్డీ కట్టాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications