For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DMart Q1 net profit: అదరగొట్టిన దమానీ: తొలి త్రైమాసికంలోనే రూ.115 కోట్లు

|

ముంబై: మెట్రో నగరాలు, ఓ మోస్తరు పట్టణవాసులకు చిరపరిచితమైన పేరు డీమార్ట్. ఈ హైపర్ చైన్ మార్కెట్లను లీడ్ చేస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే బోణీ చేసింది.. అదరగొట్టే ఫలితాలను సాధించింది. నెట్ ప్రాఫిట్‌లో 135 శాతం పురోభివృద్ధిని సాధించింది. వంద కోట్ల రూపాయల మార్క్‌ను అందుకుంది. 115 కోట్ల రూపాయల రెవెన్యూను ఆర్జించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అంచనాలకు అనుగుణంగా డీమార్ట్ రాణించినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే- 2021-2022 ఆర్థిక సంవత్సరం జూన్ 30వ తేదీ నాటికి ముగిసిన తొలి త్రైమాసికంలో 115 కోట్ల రూపాయలతో 135 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ వెల్లడించింది. 2020-2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే- తాజాగా నమోదైన నికర లాభం 65 కోట్ల రూపాయలు అధికం. గత ఏడాది ఇదే కాలానికి డీమార్ట్ 50 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ సారి ఈ మొత్తం 115 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆదాయంలో 135 శాతం మేర వృద్ధి కనిపించింది.

DMart Q1 results: Net profit jumps 132% to Rs 115 cr, It was Rs 50 crore in year-ago period

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి డీమార్ట్‌ నమోదు చేసిన మొత్తం రెవెన్యూ 5,032 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 3,833 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్, డిప్రియేషన్స్ అండ్ అమోర్టైజేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి డీమార్ట్ ఆర్జించిన ఆదాయం 221 కోట్ల రూపాయలు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 109 కోట్ల రూపాయల వద్ద నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలాకాలం నుంచి దేశవ్యాప్తగా డీమార్ట్‌కు చెందిన హైపర్ రిటైల్ అవుట్‌లెట్లు వందశాతం నడవట్లేదు.

English summary

DMart Q1 net profit: అదరగొట్టిన దమానీ: తొలి త్రైమాసికంలోనే రూ.115 కోట్లు | DMart Q1 results: Net profit jumps 132% to Rs 115 cr, It was Rs 50 crore in year-ago period

DMart operator Avenue Supermarts on Saturday reported 132% jump in standalone net profit at Rs 115 crore for the June quarter. It was Rs 50 crore in the year-ago period.
Story first published: Saturday, July 10, 2021, 15:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X