For Daily Alerts
బ్యాంకులు, బీమా సంస్థల్లో వాటా విక్రయానికి కన్సల్టెంట్
|
బ్యాంకుల్లో, బీమా కంపెనీల్లో మైనార్టీ, వ్యూహాత్మక వాటా విక్రయానికి సహాయం చేయడం కోసం ఒక కన్సల్టెంటును నియమించుకోవాలి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(DIPAM) భావిస్తోంది. ఏడాది కాలానికి ఈ నియామకం ఉంటుంది.
ఈ కన్సల్టెంటు ఇతర నియంత్రణ ఏజెన్సీలు, ఇతరత్రా విభాగాలతో కలిసి పని చేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాలి. DIPAM పనులను చక్కబెట్టాల్సి ఉంటుంది. కన్సల్టెంటు వయస్సు 65 ఏళ్లకు మించకూడదు.

బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సంస్థల్లో ముప్పై ఏళ్ళ అనుభవం ఉండి ఫైనాన్స్‌లో ఎంబీఏ లేదా ఎకనమిక్స్/కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. నెలకు రూ.ఒక లక్ష వరకు స్టైఫండ్ ఉండే ఈ పోస్టుకు డిసెంబర్ 4వ కు దరఖాస్తులకు ఆహ్వానం ఉంది.
English summary