For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPF interest rate: పీఎఫ్ డిపాజిట్లపై పిడుగు: 40 ఏళ్ల కనిష్ఠానికి

|

న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన అనంతరం తమ భవిష్యత్ అవసరాల కోసం కోట్లాదిమంది ఉద్యోగులు డిపాజిట్ చేసుకునే చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటు (EPF interest rate)ను మరోసారి కుదించింది. ఈ కుదింపు అలాంటిది ఇలాంటిది కాదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం- ఏకంగా 40 సంవత్సరాల కాలాన్ని గుర్తుకు తెచ్చినట్టయింది.

డిజిటల్ ఎకానమిపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు: 2030 నాటికిడిజిటల్ ఎకానమిపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు: 2030 నాటికి

 8.1 శాతంగా..

8.1 శాతంగా..

ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం కుదించింది. 8.1 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేటు 8.4 శాతం. దీన్ని మరింత తగ్గించింది. 8.1 శాతానికి చేర్చింది. ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్లపై ఇంత కనిష్ఠ స్థాయిలో వడ్డీరేటును నిర్ధారించడం- 40 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1977-78 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది శాతం. ఇప్పుడు దాదాపు అదే స్థాయికి పడిపోయింది.

40 బేసిస్ పాయింట్ల మేర..

40 బేసిస్ పాయింట్ల మేర..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు.. ఇవ్వాళ అస్సాంలోని గువాహటిలో భేటీ అయ్యారు. ఇది 230వ సమావేశం. ఈ సందర్భంగా డిపాజిట్లపై వడ్డీరేటును కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. ఫలితంగా- వడ్డీ రేటు 8.4 నుంచి 8.1 శాతానికి దిగజారింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా అయిదు కోట్ల మంది ఉద్యోగులపై పడుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు గత సంవత్సరం మార్చిలో చివరిసారిగా ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.4గా నిర్ధారించారు. ఇప్పుడు మళ్లీ దీన్ని 8.1కి కుదించారు.

 ఆర్థికశాఖకు తీర్మానం..

ఆర్థికశాఖకు తీర్మానం..

ఈ మేరకు ట్రస్టీలు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. నిర్మల సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ తీర్మానాన్ని పంపించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ర్యాటిఫై చేసిన వెంటనే కొత్త వడ్డీ రేటు అమలులోకి వస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుదించిన వడ్డీ రేటు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అంచనా వేస్తోన్నారు.

 కుదింపు ఇలా..

కుదింపు ఇలా..

2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల భవిష్యనిధిపై ఉన్న వడ్డీ రేటు 8.8 శాతం. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అమలులో ఉన్న వడ్డీ రేటు 8.65 శాతం. ఆ మరుసటి సంవత్సరమే అంటే 2017-18లో దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని 8.55 శాతానికి తగ్గించింది. అప్పటి నుంచీ ఇది ప్రతి సంవత్సరం దిగజారుతూ వస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5గా నిర్ధారించింది. ఇప్పుడు మళ్లి దీన్ని తాజాగా సవరించింది. 8.1 శాతానికి కుదించింది.

English summary

EPF interest rate: పీఎఫ్ డిపాజిట్లపై పిడుగు: 40 ఏళ్ల కనిష్ఠానికి | Deposits made in EPF will fetch an interest rate of 8.1% in FY 2021-22

The Employees' Provident Fund Organization (EPFO) on Saturday slashed the interest on provident fund deposits for 2021-22 to more than a four-decade low of 8.1 per cent
Story first published: Saturday, March 12, 2022, 14:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X