For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఢిల్లీ ఖాన్ మార్కెట్, ధర ఎంతంటే?

|

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ మరో మెట్టు ఎక్కింది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ ప్రకారం ఈ మార్కెట్ 20వ స్థానానికి ఎగబాకింది. మెయిన్ స్ట్రీట్స్ ఎక్రాస్ ది వరల్డ్ 2019 పేరుతో నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇది 21వ స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో ఈ మార్కెట్లో ఏడాది అద్దె పెరిగింది. దీంతో గత ఏడాది కంటే ఇప్పుడు ఓ స్థానం ఎగబాకింది.

కారులో వెళ్తున్నారా.. మీ కోసమే: డిసెంబర్ 1 నుంచి FASTag తప్పకారులో వెళ్తున్నారా.. మీ కోసమే: డిసెంబర్ 1 నుంచి FASTag తప్ప

6 డాలర్లు పెరిగిన ధర

6 డాలర్లు పెరిగిన ధర

ఖాన్ మార్కెట్‌లో చదరపు అడుగుకు వార్షిక అద్దె గత ఏడాది 237 డాలర్లుగా ఉంటే ఈ ఏడాది 243 డాలర్లకు (ప్రస్తుత మారకం ప్రకారం రూ.17,400కు పైగా) పెరిగిందని నివేదిక తెలిపింది. గత ఏడాది కంటే ఆరు డాలర్లు పెరిగింది. దీంతో గత ఏడాది 21వ స్థానంలో ఉన్న ఈ మార్కెట్ 20వ స్థానానికి ఎగబాకింది.

మన దేశంలోని మిగతా నగరాల్లో...

మన దేశంలోని మిగతా నగరాల్లో...

ప్రపంచవ్యాప్తంగా 68 దేశాల్లోని 448 ప్రాంతాల్లోని అద్దెలను పరిశీలించారు. ఇందులో ఢిల్లీ ఖాన్ మార్కెట్ టాప్ 20లో స్థానం దక్కించుకుంది. మిగతా భారత మార్కెట్ విషయానికి వస్తే ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు నగరాల్లో అద్దెలు స్వల్పంగా పెరిగాయి. చెన్నై, పుణే, కోల్‌కతాల్లో అద్దెలు కాస్త ఎక్కువగా పెరిగాయి.

ఈ నగరాల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

ఈ నగరాల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

భారత్‌లోని ఈ నగరాలకు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని, ఇక్కడ కూడా అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్ లెట్స్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని ఈ నివేదిక పెరిగింది. దీంతో అద్దెలు పుంజుకుంటున్నట్లు తెలిపింది.

టాప్ 5 స్థానాలివే...

టాప్ 5 స్థానాలివే...

ఈ జాబితాలో తొలి ఐదు స్థానాల్లో కాజ్‌వే బే (హాంగ్‌కాంగ్) 2,745 డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. అప్పర్ ఫిఫ్త్ అవెన్యూ (న్యూయార్క్) 2,250 డాలర్లతో రెండో స్థానంలో ఉంది. న్యూ బాండ్ స్ట్రీట్ (లండన్) 1,714 డాలర్లతో మూడో స్థానంలో, అవెన్యూ డెస్ చాంప్స్ (ప్యారిస్) 1,478 డాలర్లతో నాలుగో స్థానంలో, మిలన్ (ఇటలీ) 1,447 డాలర్లతో ఐదో స్థానంలో నిలిచాయి.

వీటికి ఎక్కువ చెల్లింపు

వీటికి ఎక్కువ చెల్లింపు

ఫుడ్, కూల్ డ్రింక్స్, బట్టల దుకాణాల యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో అద్దెలు చెల్లిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. యాక్సెసరీస్, హైపర్ మార్కెట్లు భారీగానే తెరుచుకుంటున్నాయని చెప్పిన సర్వే.. ఈ-కామర్స్‌ రిటైలర్లు ఆన్‌లైన్‌తో పాటు భౌతిక మార్కెట్ల పైనా దృష్టి సారిస్తున్నారని పేర్కొంది. దీంతో ప్రధాన స్ట్రీట్‌లలో ఈ-కామర్స్ సంస్థల కార్యాలయాలు, ఔట్‌లెట్లు వెలుస్తున్నాయని తెలిపింది.

English summary

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఢిల్లీ ఖాన్ మార్కెట్, ధర ఎంతంటే? | Delhi's Khan Market world's 20th most expensive retail location

Delhi's upscale Khan Market has moved up one position to become the world's 20th most expensive retail location, according to global property consultant Cushman & Wakefield.
Story first published: Monday, November 25, 2019, 8:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X