For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loan Apps: లోన్ యాప్స్ తో జాగ్రత్త.. ఎంత అవసరమైనా ఈ 40 యాప్స్ జోలికి పోకండి.. పోలీసులు ఇచ్చిన లిస్ట్..

|

Loan Apps: ఈరోజుల్లో చాలా మంది తక్షణ అప్పుకోసం ఆన్ లైన్ లో కొన్ని యాప్స్ ను సంప్రదించటం వారి ప్రాణాలకే చేటుగా మారింది. లోన్ యాప్ అకృత్యాల కారణంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనం ఇప్పటికే చూస్తున్నాం. ఈ తరుణంలో పోలీసులు ఇలాంటి కంపెనీలపై దృష్టి సారించారు.

రూ.500 కోట్ల కుంభకోణం..

రూ.500 కోట్ల కుంభకోణం..

500 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించిన కుంభకోణాన్ని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) శనివారం ఛేదించింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ప్రకారం.. స్కామ్‌లో చైనీస్ కనెక్షన్‌లను కలిగి ఉన్న తక్షణ రుణ దరఖాస్తుల వివిధ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి గత రెండు నెలల్లో 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

హవాలా రూపంలో చైనాకు డబ్బు..

హవాలా రూపంలో చైనాకు డబ్బు..

చైనీయులు హవాలా మార్గంలో లేదా క్రిప్టో-కరెన్సీలో పెట్టుబడి రూపంలో చైనాకు రూ.500 కోట్లను తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రత్యేక సెల్ ఢిల్లీ నివేదిక ప్రకారం.. Raise cash app, PP money app, Rupees master app, Cash ray app, Mobipocket app, Papa money app, Infinity cash app, Kredit mango app, Kredit marvel app, CB loan app, Cash advance app, HDB loan app, Cash tree app, RAw loan app, Minute cash app, Cash light app, Cash fish app, HD credit app, Ruppes land app, Cash room app, Rupee loan app, Well Kredit app యాప్స్ జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.

లఖ్నో కేంద్రంగా చైనా యాప్స్..

లఖ్నో కేంద్రంగా చైనా యాప్స్..

ఇదే క్రమంలో లఖ్నో కేంద్రంగా చైనీయులకు సంబంధించిన కాల్ సెంటర్ నడుపుతున్న 18 యాప్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ అవసరాల కోసం ఇలాంటి వాటి జోలికి పోవద్దని వారు హెచ్చరిస్తున్నారు. Cash Port, RupeeWay, LoanCube, WowRupee, SmartWallet, GiantWallet, HiRupee, SwiftRupee, Walletwin, Fishclub, Yeahcash, ImLoan, Growtree, MagicBalance, Yocash, FortuneTree, Supercoin, RedMagic యాప్ లను ఈ ముఠా లఖ్నో కేంద్రంగా నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అధిక వడ్డీ రేట్లకు రుణాలు..

అధిక వడ్డీ రేట్లకు రుణాలు..

ఇన్‌స్టంట్ లోన్ అప్లికేషన్‌లు అధిక రేట్లకు రుణాలు మంజూరు చేస్తున్నాయని.. రుణం చెల్లించిన తర్వాత కూడా మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను ఉపయోగించి డబ్బులు దండుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులకు వందలాది ఫిర్యాదులు అందాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. దాదాపు 100 కంటే ఎక్కువ యాప్స్ మాటున లోన్స్ దోపిడీ రాకెట్ ఉన్నట్లు మల్హోత్రా చెప్పారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాటికి ఆకర్షితులు కావద్దని సూచిస్తున్నారు.

English summary

Loan Apps: లోన్ యాప్స్ తో జాగ్రత్త.. ఎంత అవసరమైనా ఈ 40 యాప్స్ జోలికి పోకండి.. పోలీసులు ఇచ్చిన లిస్ట్.. | delhi police released list of Instant loan app racket names that users should Beware know details

Beware of these apps! Delhi Police Special Cell releases names after China connection found
Story first published: Sunday, August 21, 2022, 18:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X