న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమల నుండి సామాన్యుల వరకు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (24, మార్చి) కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఏటీఎంలపై ఊరట
కరోనా మహమ్మారి నేపథ్యంలో డెబిట్ కార్డు కలిగిన వారికి ఊరట కల్పించే వార్త చెప్పారు. డెబిట్ కార్డు ఉన్నవారు మరో మూడు నెలల పాటు ఏ ఏటీఎం కేంద్రం నుండి డబ్బులు విత్ డ్రా చేసిన ఛార్జీ పడదు. బ్యాంకు బ్రాంచీల వద్ద ఎక్కువ మంది ఉండకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో కస్టమర్లకు భారం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతానికి మినిమం బ్యాలెన్స్ ఊరట
కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారి వారి బ్యాంకు అకౌంట్ మినిమం బ్యాలెన్స్ పరిమితిని కూడా తాత్కాలికంగా ఎత్తి వేస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మినిమం లిమిట్ బ్యాలెన్స్ అవసరం లేదన్నారు. ప్రజలకు అవసరమైన మొత్తం తీసుకోవచ్చునని చెప్పారు.

ప్రధాని మానిటరింగ్
ప్రధాని నరేంద్ర మోడీ అన్ని అంశాలను మానిటరింగ్ చేస్తున్నారని, ప్రజలకు కావాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారన్నారు. అంతేకాదు, ఆర్థిక ఎమర్జెన్సీ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications