For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Returns 2021-22: ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

|

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? అయితే మీకో ఊరట. ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు CBDT గురువారం ప్రకటించింది. కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువును ఇచ్చింది. మరోవైపు, ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన కొత్త ఐటీ వెబ్ పోర్టల్‌లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాలేదు. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న గడువును ఐటీ శాఖ డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.

ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్(www.incometax.gov.in)ను ఇన్ఫోసిస్ అందుబాటులోకి తీసుకురాగా అప్పటి నుండి టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించిన ఇన్ఫోసిస్‌కు కేంద్రం డెడ్‌లైన్ విధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సలీల్ పరేఖ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గడువును నిర్దేశించారు.

Deadline for filing ITR for AY 2021-22 extended till December 31

సెప్టెంబర్ 15వ తేదీలోగా పోర్టల్‌కు సంబంధించిన లోపాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పోర్టల్ అందుబాటులోకి వచ్చిన మూడు నెలలకు వస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. సమస్యలు కొనసాగుతుండటంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

English summary

IT Returns 2021-22: ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు | Deadline for filing ITR for AY 2021-22 extended till December 31

Citing difficulties reported by the taxpayers and other stakeholders, the Central Board of Direct Taxes (CBDT) on Thursday decided to further extend the due dates for filing of Income Tax Returns and various reports of audit for the Assessment Year 2021-22.
Story first published: Thursday, September 9, 2021, 21:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X