For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Jobs: ఈ స్కిల్ ఉన్న వారికి భారీగా డిమాండ్.. ఉద్యోగుల వేటలో కంపెనీలు.. మీకు ఈ టెక్నాలజీ తెలుసా..?

|

IT Jobs: టెక్ మార్కెట్‌లో నియామకంలో కొంచెం మందగమనం ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఒక స్కిల్ ఉన్న వారికి మాత్రం విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు అనేక సర్వేల్లో తేలింది. అదే డేటా అనలిటిక్స్. డేటా అనేది కొత్త ఇంధనం. ఈ సమాచారం విశ్లేషించటం వల్ల వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ అన్నారు. ఈ రోజుల్లో ప్రతి సంస్థ తమ డేటా స్ట్రక్చర్‌లు, డేటా లేక్‌లు ఉండేలా చూసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 హైరింగ్ ట్రెండ్‌ల నివేదిక..

హైరింగ్ ట్రెండ్‌ల నివేదిక..

తాజా నివేదికల ప్రకారం ఐటీ కంపెనీల్లోని రిక్రూటర్లు వెతుకుతున్న టాప్ త్రీ స్కిల్స్ లిస్ట్‌లో డేటా అనలిటిక్స్ అగ్రస్థానంలో ఉంది. డేటా అనలిటిక్స్ అవసరం పెరిగినందున, ఈ డొమైన్‌లో ప్రతిభకు డిమాండ్ కూడా పెరిగింది. రాబోయే సంవత్సరంలో డేటా అనలిటిక్స్ రోల్స్ 6-10 శాతం వృద్ధిని చూడవచ్చని తేలింది. అయితే డేటా సైన్స్ రోల్స్ కు 4-6 శాతం వృద్ధి ఉంటుందని వెల్లడైంది.

 డేటా విశ్లేషకులకు ఎందుకు భారీ డిమాండ్ ఉంది?

డేటా విశ్లేషకులకు ఎందుకు భారీ డిమాండ్ ఉంది?

డేటా విశ్లేషణ సంస్థలు మార్కెట్ ప్రవర్తనను అంచనా వేయడానికి, వారి పోటీ బలాలు, బలహీనతలను అర్థం చేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాయని TeamLease EdTech Limited ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ అన్నారు. డేటాను అనలైజ్ చేయటం ద్వారా.. మొత్తం వ్యాపార వ్యూహాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని అన్నారు. కస్టమర్ ప్రవర్తనను అంచనా వేయడానికి, వారిని నడిపిస్తున్న వాటిని అర్థం చేసుకోవడానికి బిగ్ డేటా అనలిటిక్స్ కూడా ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు.

మార్కెట్‌లో తగినంత మంది డేటా అనలిస్ట్‌లు ఉన్నారా?

మార్కెట్‌లో తగినంత మంది డేటా అనలిస్ట్‌లు ఉన్నారా?

భారీ స్థాయిలో డేటా పెరగడం వల్ల అర్హత కలిగిన డేటా విశ్లేషకుల అత్యవసర అవసరం ఏర్పడిందని శర్మ తెలిపారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు చాలా తక్కువగా ఉండటం వల్ల డేటా అనలిస్ట్ లకు అత్యధిక డిమాండ్ ఉందని పేర్కొన్నారు. మెటావర్స్ రాకతో డేటా అనలిటిక్స్ వినియోగం ముఖ్యమైనదిగా మారింది. అనేక స్టార్టప్ కంపెనీల్లో వీరికి డిమాండ్ ఎక్కువగా ఉందని హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ డైరెక్టర్ పరాగ్ ఘట్‌పాండే తెలిపారు.

డిమాండ్ ఏ రంగాల్లో.. ఏ స్కిల్స్ కావాలి..?

డిమాండ్ ఏ రంగాల్లో.. ఏ స్కిల్స్ కావాలి..?

డేటా అనలిటిక్స్ రంగంలో కీలకమైన ఉద్యోగ పాత్రల్లో డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, బిగ్ డేటా ఆర్కిటెక్ట్, డెసిషన్ సైంటిస్ట్‌లు ఉంటారు. వీటికి స్ట్యాటస్టికల్ హైపోతసిస్ టెస్టింగ్, స్ట్యాటస్టిక్స్, చీ స్క్వేర్ టెస్ట్, కొరిలేషన్ యనాలసిస్, రిగ్రషన్ యనాలసిస్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, న్యూరల్ నెట్ వర్క్స్ వంటి అంశాలపై మంచి నైపుణ్యం అవసరం. వీటి ద్వారా వివిధ రంగాలలోని సంస్థల్లో ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్‌లను చేపట్టవచ్చు.డేటా అనలిటిక్స్ డొమైన్‌లో స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను అందించే 3AI, MOOC, ఆఫ్‌లైన్ సెంటర్ల వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉన్నాయి. వీరికి కేవలం ఐటీ రంగం నుంచి మాత్రమే కాకుండా.. రిటైల్, వాణిజ్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్ తో పాటు ఇతర ప్రభుత్వ రంగాల నుంచి మంచి డిమాండ్ ఉంది

English summary

IT Jobs: ఈ స్కిల్ ఉన్న వారికి భారీగా డిమాండ్.. ఉద్యోగుల వేటలో కంపెనీలు.. మీకు ఈ టెక్నాలజీ తెలుసా..? | data analytics skilled workers having huge demand in job market in india as latest surveys revealed reasons behind this

Why data analytics is the hottest skill recruiters are looking for
Story first published: Sunday, August 7, 2022, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X