For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BoAt IPO: రూ.వేల కోట్ల సమీకరణ: సెబికి ప్రపోజల్స్

|

ముంబై: హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచీల సెగ్మెంట్‌కు చెందిన బోట్ (BoAt).. పబ్లిక్ ఇష్యూకు రానుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు సమర్పించింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేయడం ద్వారా ఇన్వెస్టర్ల నుంచి 2,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో ఫ్రెష్ ఆఫరింగ్ 900 కోట్ల రూపాయలు, ఆఫర్ ఫర్ సేల్ 1,100 కోట్ల రూపాయలుగా చూపించింది.

అదాని చేతికి మరో భారీ ప్రాజెక్ట్: కర్నూలు, గుంటూరు ఆ కంపెనీకిఅదాని చేతికి మరో భారీ ప్రాజెక్ట్: కర్నూలు, గుంటూరు ఆ కంపెనీకి

షేర్ హోల్డర్లు సమీర్ మెహతా, అమన్ గుప్తా 150 కోట్ల రూపాయల చొప్పున, సౌత్ లేక్ ఇన్వెస్ట్‌మెంట్ 800 కోట్ల రూపాయల మేర తమ వాటాలను విక్రయించుకోనున్నారు. ఇమాజిన్ మార్కెటింగ్.. బోట్‌ను ప్రమోట్ చేస్తోంది. దేశంలో అతిపెద్ద డైరెక్ట్-టు-కన్జ్యూమర్ సెగ్మెంట్ ఇది. ఆడియో బేస్డ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌ను బోట్‌ను ప్రమోట్ చేస్తోంది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకుంది.

D2C firm Boat owned by Imagine Marketing, has filed its documents with the SEBI for IPO

కంపెనీ వాల్యుయేషన్ రెండు బిలియన్ల డాలర్ల వరకు చూపించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. డ్రాఫ్ట్​ రెడ్​ హెర్రింగ్​ ప్రాస్​స్పెక్టస్​ ప్రకారం.. ఈక్విటీ షేర్లు, అగ్రిగేటింగ్​ అప్​ 900 కోట్ల రూపాయలు, సేల్​ అగ్రిగేటింగ్​‌ను 1,100 కోట్ల రూపాయల మేర చూపించింది. ఐపీఓ ద్వారా సమీకరించిన 2,000 కోట్ల రూపాయల్లో మెజారిటీ మొత్తాన్ని రుణ చెల్లింపుల వినియోగిస్తుంది. మిగిలిన మొత్తంతో దేశవ్యాప్తంగా ఎక్స్‌క్లూజివ్ బ్రాండింగ్ అవుట్‌లెట్లను నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.

2013లో అమన్ గుప్తా, సమీర్ మెహతా ఈ కంపెనీని నెలకొల్పారు. ఇమాజిన్​ మార్కెటింగ్​ పేరుతో స్థాపించారు. ఈ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ బోట్. హెడ్​ ఫోన్స్​, స్మార్ట్​ వాచ్​ వంటి ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేశారు. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ వార్‌బర్గ్ 36 శాతం వాటాను కలిగి ఉంది. అమన్ గుప్తా, సమీర్ గుప్తా వాటా 56 శాతం. క్వాల్‌కామ్ వెంచర్స్ నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఇమాజిన్ మార్కెటింగ్ సాధించింది.

దీనితో మొత్తం కంపెనీ వాల్యుయేషన్ 2,200 కోట్ల రూపాయలకు చేరింది. క్వాల్‌కామ్‌తో పాటు ఫైర్‌సైడ్ వెంచర్స్ అయిదు శాతం మేర స్టేక్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ ఎంత అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌పై సెబి ఆమోదముద్ర లభించిన తరువాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. అలాగే ఐపీఓ ఓపెనింగ్ తేదీ, లిస్టింగ్ వంటివన్నీ అప్పుడే ఖరారు కానున్నాయి.

English summary

BoAt IPO: రూ.వేల కోట్ల సమీకరణ: సెబికి ప్రపోజల్స్ | D2C firm Boat owned by Imagine Marketing, has filed its documents with the SEBI for IPO

Imagine Marketing, the parent of electronics brand BoAt, has reportedly filed draft papers with market regulator SEBI to raise up to Rs 2,000 crore through an IPO.
Story first published: Saturday, January 29, 2022, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X