For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూన్ 30 వరకు పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలు, ఎందుకంటే

|

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు పైన ఆంక్షలు జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం వెల్లడించింది. ఈ బ్యాంకులో ఉపసంహరణలు, డిపాజిట్ల పైన ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. న‌ష్టాల ఊబిలో చిక్కుకున్న PMC డిపాజిట‌ర్ల డ‌బ్బు ప‌రిర‌క్ష‌ణలో భాగంగా ఆర్బీఐ కార్యాచ‌ర‌ణ కొనసాగిస్తోంది. కొన‌సాగిస్తున్న‌ది. ప్ర‌త్యేకించి బ్యాంక్ డిపాజిట‌ర్ల న‌గ‌దుకు భ‌ద్ర‌త క‌ల్పించే ఇన్వెస్ట‌ర్ల కోసం అన్వేష‌ణ సాగిస్తున్న‌ది.

పీఎంసీ బ్యాంకు పరిరక్షణ కోసం తాము చేపట్టిన చర్యలు అమల్లోకి రావడానికి కాస్త సమయం పట్టవచ్చునని, ఈ కారణంగా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ హెచ్‌డీఐఎల్ సంస్థకు రుణాల మంజూరు వివరాల్లో తేడాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ తనిఖీల్లో తేలిందని పీఎంసీ బోర్డును 2019 సెప్టెంబర్ నెలలో ఆర్బీఐ తప్పించింది.

Curbs on PMC Bank extended till 30 June

ఖాతాదారుల ఉపసంహరణలు తదితర ట్రాన్సాక్షన్స్‌కుసంబంధించి ఆంక్షలు అమలు చేసింది. ఈ నిబంధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు బ్యాంకు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు ఇన్వెస్టర్ల నుండి ఆఫర్లు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో పీఎంసీ బ్యాంకు ఎక్స్‌పరెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను జారీ చేసింది. ఇప్పుడు డిపాజిటర్లు, వాటాదారుల హక్కుల పరిరక్షణకు, వారికి భద్రత కల్పించే సామర్థ్యం గల ఇన్వెస్టర్ల కోసం గాలిస్తున్నాయి.

English summary

జూన్ 30 వరకు పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలు, ఎందుకంటే | Curbs on PMC Bank extended till 30 June

The RBI on Friday said it has extended restrictions on withdrawals and deposits in the Punjab and Maharashtra Cooperative (PMC)Bank till 30 June, as it works to finalize an investor for the scam-hit multi-state cooperative bank.
Story first published: Saturday, March 27, 2021, 20:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X