For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ జంప్: నష్టపోయిన ఎథేరియం, కార్డానో, లైట్ కాయిన్

|

క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత కొద్దిరోజులుగా ఊగిసలాటలో ఉంటోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ 42,000 డాలర్లకు అటు ఇటుగా కదలాడుతోంది. ఓసారి స్వల్పంగా లాభపడుతూ, మరోసారి నష్టపోతూ పైకి, కిందకు కదలాడుతోంది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 40 డాలర్ల మేర లాభపడి 42,409.50 వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం 21 డాలర్లు క్షీణించి 3,139 డాలర్ల వద్ద, షిబా ఇను 0.000028 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ 2021 నవంబర్ నెలలో 69,000 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత ఒమిక్రాన్ దెబ్బతో క్షీణిస్తోంది. ఇటీవల ఓ సమయంలో 40,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అప్పటి నుండి దాదాపు ఇదే స్థాయిలో ట్రేడ్ అవుతోంది.

బిట్ కాయిన్ నేటి ఉదయం 0.59 శాతం లాభపడి రూ.33,93,244 (భారత కరెన్సీ పరంగా) వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం మాత్రం 1.78 శాతం క్షీణించి రూ.2,52,909 వద్ద ట్రేడ్ అయింది. కార్డానో మాత్రం 5.26 శాతం క్షీణించి రూ.120.59 వద్ద, అవాలంచె 0.85 శాతం తగ్గి రూ.6879.58 వద్ద, పోల్కాడాట్ 2.12 శాతం తగ్గి రూ.2,021.25 వద్ద, లైట్ కాయిన్ 5.53 శాతం క్షీణించి రూ.11,264.1 వద్ద, ట్రేడ్ అయింది. టెథెర్ 0.21 శాతం ఎగిసి రూ.80.05 వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్స్ షిబా ఇను 0.000028 వద్ద, డోజీకాయిన్ రూ.12.26 వద్ద ట్రేడ్ అయింది.

Cryptocurrency

క్రోనోడ్స్ క్రిప్టో నేడు ఒక్కరోజు 33 శాతం లాభపడి 10.02 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి బిగ్గెస్ట్ కెయినర్స్‌లో పాట్రోన్ 1900 శాతం, సైఆప్షన్స్ 986 శాతం, ల్యాటోకెన్ 448 శాతం ఎగిసిపడింది. భారీగా నష్టపోయిన వాటిలో నింజా ఫ్లోకీ, మాన్‌స్టర్ అఫ్ గాడ్ ఉన్నాయి. ఇక, క్రిప్టో కరెన్సీ 2022లో భారీగా క్షీణిస్తోంది. బిట్ కాయిన్ 9 శాతం మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రిప్టో లేదా బిట్ కాయిన్ ఫండ్ 2022లో ఇప్పటి వరకు 30 శాతం మేర క్షీణించింది.

English summary

బిట్ కాయిన్ జంప్: నష్టపోయిన ఎథేరియం, కార్డానో, లైట్ కాయిన్ | Cryptocurrency Prices Today: Ethereum, Cardano, Litecoin decline

Memecoin SHIB fell 3.13 percent, while Dogecoin decreased 2.18 percent to trade at Rs 13.27. Terra (LUNA) rose 3.19 percent to Rs 6,408.4.
Story first published: Wednesday, January 19, 2022, 21:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X