For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఒక్కదేశం ఎఫెక్ట్, భారీగా ఎగిసిన బిట్ కాయిన్: ఏ క్రిప్టో ఎంత ఉందంటే

|

క్రిప్టోకరెన్సీ నేడు పుంజుకుంది. వరల్డ్ నెంబర్ వన్ క్రిప్టో బిట్ కాయిన్, పోల్కాడాట్, డోజీకాయిన్ వంటివి ఏకంగా 14 శాతానికి పైగా ఎగిశాయి. టాప్ 10లోని ఎనిమిది క్రిప్టోలు భారీ లాభాల్లో ఉన్నాయి. మిగతా రెండు కూడా అతి స్వల్పంగా లాభపడ్డాయి. బిట్ కాయిన్ మిగతా కరెన్సీలతో పోలిస్తే లాభపడింది. క్రిప్టో కరెన్సీలు లాభపడటానికి పలు కారణాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా ఎల్ సాల్వెడార్, సౌత్ కొరియా నిర్ణయాలు కలిసి వచ్చాయి. క్రిప్టో కరెన్సీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రభావం క్రిప్టో పైన ఉంది.

బిట్ కాయిన్‌కు ఓకే, కానీ

బిట్ కాయిన్‌కు ఓకే, కానీ

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ సాల్వెడార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ సాల్వెడార్ నిలిచింది ఈ సౌత్ అమెరికన్ దేశం.

ఎలాంటి ట్రాన్సాక్షన్స్‌కైనా ఈ డిజిటల్ కరెన్సీని ఉపయోగించవచ్చునని టెక్నాలజీ లేని సంస్థలు మినహా మిగతా వ్యాపార సంస్థలు బిట్‌కాయిన్ మారకంలో చెల్లింపులను స్వీకరించవచ్చునని వెల్లడించింది. అయినప్పటికీ తమ దేశానికి అమెరికా డాలర్ అధికారిక కరెన్సీగా ఉంటుందని, బిట్ కాయిన్ రూపంలో చెల్లింపులు జరపాలని బలవంతం లేదని స్పష్టం చేసింది.

అభివృద్ధికి ఊతం

అభివృద్ధికి ఊతం

ఈ క్రిప్టోకరెన్సీలో ట్రాన్సాక్షన్స్ జరపడం కోసం ప్రజలకు శిక్షణ కూడా కల్పించనున్నట్లు తెలిపింది ఎల్ సాల్వెడార్. అధికారికంగా ప్రకటించాక 90 రోజుల తర్వాత కొత్త చట్టం అమల్లోకి వస్తుందని, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు, పెట్టుబడులు, పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇది తోడ్పడగలదని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్‌కాయిన్ మారకం వ్యాల్యూపరంగా ఎవరూ నష్టపోయే రిస్క్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సౌత్ కొరియన్ లామేకర్స్ కూడా కొత్త క్రిప్టో లెగిస్లేషన్‌ను డ్రాఫ్ట్ చేస్తున్నారు.

నేటి క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

నేటి క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

నేడు బిట్ కాయిన్ 12 శాతానికి పైగా ఎగిసి 37,017.47 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత ఎథేరియం 2,568.50 డాలర్లు, బియాన్స్ కాయిన్ 370.22 డాలర్లు, టెథెర్ 1.00, కార్డానో 1.60 డాలర్లు, డోజీకాయిన్ 0.34 డాలర్లు, XRP 0.89 డాలర్లు, పోల్కాడాట్ 23.91 డాలర్లు, USD కాయిన్ 1 డాలరు, యూనిస్వాప్ 24.58 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

ఆ ఒక్కదేశం ఎఫెక్ట్, భారీగా ఎగిసిన బిట్ కాయిన్: ఏ క్రిప్టో ఎంత ఉందంటే | Cryptocurrency Prices Today: Bitcoin, Polkadot, Dogecoin surge up to 14 percent

Led by Bitcoin, eight out of top 10 digital currencies gained as much as 14 per cent on Thursday as of 09.30 hours (IST). The crypto market has welcomed El Salvador's and South Korea's move, which is likely to increase the acceptability of digital tokens.
Story first published: Thursday, June 10, 2021, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X