For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

38,000 డాలర్లు దాటి, మళ్లీ పడిపోయిన బిట్ కాయిన్, జూన్ 3 తర్వాత ఇదే గరిష్టం

|

ప్రపంచ క్రిప్టోకరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ నేడు 5 శాతం ఎగిసిపడింది. బిట్ కాయిన్‌కు సంబంధించి బాసెల్ కమిటీ బ్యాంకులకు పచ్చజెండా ఊపింది. దీంతో ఈ క్రిప్టో కింగ్ ఓ సమయంలో 38వేల డాలర్లు దాటింది. జూన్ 3వ తేదీ నుండి ఇదే గరిష్టం. అయితే ఆ తర్వాత కాస్త క్షీణించి 36వేల డాలర్ల పైన ట్రేడ్ అయింది. బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాసెల్ ఈ డిజిటల్ కరెన్సీని హై-రిస్క్ అసెట్‌గా గుర్తించింది. ఈ ప్రభావం బిట్ కాయిన్ పైన పడింది. మరో బిట్ కాయిన్ ఎథేరియం గత 24 గంటల్లో 5 శాతం పతనమై, 2435 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

సేవింగ్స్ అకౌంట్స్‌పై ఎక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులివేసేవింగ్స్ అకౌంట్స్‌పై ఎక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులివే

బిట్ కాయిన్ వ్యాల్యూ

బిట్ కాయిన్ వ్యాల్యూ

బిట్ కాయిన్ 36,335 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 2 శాతం, గడిచిన వారం రోజుల్లో 3.85 శాతం తగ్గింది. ఎథేరియం 2,435 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 5.31 శాతం, గడిచిన వారం రోజుల్లో 11.00 శాతం తగ్గింది. టెథెర్ 1 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 0.02 శాతం, గడిచిన వారం రోజుల్లో 0.01 శాతం తగ్గింది. బియాన్స్ కాయిన్ 347 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 5.84 శాతం, గడిచిన వారం రోజుల్లో 13.67 శాతం తగ్గింది.

మరిన్ని క్రిప్టో కాయిన్స్

మరిన్ని క్రిప్టో కాయిన్స్

కార్డానో 1.51 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 5.68 శాతం, గడిచిన వారం రోజుల్లో 13.37 శాతం తగ్గింది. డోజీకాయిన్ 0.3225 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 4.69 శాతం, గడిచిన వారం రోజుల్లో 15.29 శాతం తగ్గింది. XPR 0.8581 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 4.47 శాతం, గడిచిన వారం రోజుల్లో 13.61 శాతం తగ్గింది. పోల్కాడాట్ 22.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 6.68 శాతం, గడిచిన వారం రోజుల్లో 10.72 శాతం తగ్గింది. యూఎన్ఎల్ స్వాప్ 22.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గడిచిన 24 గంటల్లో 7.60 శాతం, గడిచిన వారం రోజుల్లో 15.68 శాతం తగ్గింది.

మార్కెట్ క్యాప్

మార్కెట్ క్యాప్

గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 2 ట్రిలియన్ డాలర్లను దాటింది. గ్లోబల్ క్రిప్టో యూజర్స్ 2018-20 ఏడాదిలో 190 శాతం పెరిగారు. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల క్రిప్టోకరెన్సీ యూజర్స్ ఉన్నారు. 5000 వరకు డిజిటల్ అసెట్స్ ఉన్నాయి.

English summary

38,000 డాలర్లు దాటి, మళ్లీ పడిపోయిన బిట్ కాయిన్, జూన్ 3 తర్వాత ఇదే గరిష్టం | Cryptocurrency Bitcoin hits 38,000 dollars today

Cryptocurrency Bitcoin jumped five percent after the Basel Committee's proposal gave banks a green light to hold Bitcoin. But, the committee recommended stricter capital requirements for holding bitcoin.
Story first published: Friday, June 11, 2021, 18:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X