బిట్ కాయిన్ క్షీణత, ఐనా 48,000 డాలర్లకు సమీపంలోనే
క్రిప్టోకరెన్సీ సోమవారం నష్టాల్లో కనిపించాయి. ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. రిస్కియర్ అసెట్ క్లాస్‌లో అస్థిరతకు ముందు ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకున్నారు. టాప్ 10 క్రిప్టో కరెన్సీలు కూడా నేటి ఉదయం సెషన్‌లో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. కార్డానో, బియాన్స్ కాయిన్, పోల్కాడాట్ 4 శాతం మేర నష్టపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ ఒక శాతం తగ్గి 2.1 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 13 శాతం తగ్గింది. ఎథేరియం 3300 వద్ద సురక్షిత స్థానంలో ఉంది. బిట్ కాయిన్ 48,000 సమీపంలో ఉంది.
ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలుగా ఊగిసలాటలో ఉంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మే నెల తర్వాత సెప్టెంబర్. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమై, 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత 47వేల డాలర్లకు చేరుకొని, మళ్లీ 42వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. తిరిగి కోలుకొని, 48,000 డాలర్ల సమీపానికి చేరుకుంది.

క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ
బిట్ కాయిన్: $47,427.74, క్షీణత 0.95%
ఎథేరియం: $3,332.65, క్షీణత 1.92%
కార్డానో: $2.17, క్షీణత 3.94%
బియాన్స్ కాయిన్: $413.54, క్షీణత 3.57%
టెథేర్: $1, క్షీణత 0.02%
సోలానా: $166.15, క్షీణత 2.39%
XRP: $1.02, క్షీణత 1.67%
USD కాయిన్: $1, క్షీణత 0.02%
పోల్కాడాట్: $30.77, క్షీణత 3.95%
డోజీకాయిన్: $0.2142, క్షీణత 2.19%