For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పతనమైన బిట్ కాయిన్, టెర్రా 11 శాతం జంప్

|

క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ గురువారం ప్రారంభ సెషన్‌లో లాభపడి, ఆ తర్వాత క్షీణించింది. నేడు సాయంత్రం సెషన్‌కు దాదాపు 3.5 శాతం మేర పతనమైంది. రేపు అమెరికా కీ ఎకనమిక్ డేటా విడుదల కానున్న నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బిట్ కాయిన్, పోల్కాడాట్ మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే టాప్ టెన్‌లోని మిగతా టాప్ 8 క్రిప్టో కరెన్సీలు మాత్రం లాభపడ్డాయి. టెర్రా 11 శాతం లాభపడగా, బియాన్స్ కాయిన్ 5 శాతం లాభపడింది.

గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ స్వల్పంగా నష్టపోయి, 2.36 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 6 శాతం తగ్గి 102.17 బిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టోల్లో బిట్ కాయిన్, పోల్కాడాట్ క్షీణించగా, ఎథేరియం, టెథేర్, సోలానా, కార్డానో, యూఎస్డీ కాయిన్ లాభపడ్డాయి. ఇవి 2 శాతం వరకు ఎగిశాయి. ఇక బియాన్స్ కాయిన్ 5 శాతానికి పైగా, ఎక్స్‌పీఆర్ దాదాపు నాలుగు శాతం ఎగిసిపడగా, టెర్రా మాత్రం 11 శాతం లాభపడింది.

Crypto prices today: Bitcoin edges lower: Terra, Binance Coin gain up to 11%

వర్జీనియాకు చెందిన ప్రముఖ మైక్రో స్ట్రాటెజీ నవంబర్ 29వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ మధ్య 82.4 మిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన 1434 బిట్ కాయిన్స్‌ను కొనుగోలు చేసింది. దీంతో హోల్డింగ్స్ పెరిగాయి. మైక్రో స్ట్రాటెజీ తన ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచినప్పటికీ, మరోవైపు బియ్ కాయిన్ మాత్రం క్షీణించింది.

English summary

భారీగా పతనమైన బిట్ కాయిన్, టెర్రా 11 శాతం జంప్ | Crypto prices today: Bitcoin edges lower: Terra, Binance Coin gain up to 11%

The cryptocurrency cart inched higher on Thursday even as investors sold the largest digital token, Bitcoin. Investors, meanwhile, remained cautious ahead of the key economic data.
Story first published: Thursday, December 9, 2021, 22:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X